Monday, 1 December 2014

గీతాజయంతి

గీతాజయంతి
గీతా ఒక శాస్త్రం. ఒక గ్రంధం, ఒక ఐతిహ్యం, ఒక పరమ పథసోపానం, సాక్షాత్భగవంతుడు మనకు అందించిన జీవన్ముక్తికి మార్గదర్శి. మానవ మనుగడకు దిక్సూచి. అందుకే ఇది పవిత్ర గ్రంధం అయింది. ద్వాపర యుగం నాడు మనకి సంప్రాప్తించి ఆచంద్రతారార్కం మనల్ని నడిపే జీవిత నౌక. భగవద్గీత కూడా పరమాత్మునిలా రూపంలో చూసినా, రూపంలో గోచరమవుతుంది. సమస్త జీవన మీమాంసలకీ నిత్య నూతన సమాధానం అందించే మహత్తర గ్రంధం శ్రీమద్భగవద్గీత.

గీకారం త్యాగరూపం స్యాత్ తకారమ్ తత్వబోధకమ్
గీతా వాక్య మిదమ్ తత్వం జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:
గీత అను రెండక్షరముల తాత్పర్యమును శ్లోకం తెలుపు చున్నది. "గీ" అను అక్షరము త్యాగమును బోధించుచున్నది. "" అను అక్షరము తత్వమును అనగా ఆత్మస్వరూపమును ఉపదేశించుచున్నది. గీత యను రెండుశబ్దముల కర్ధము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు.

త్యాగశబ్దమునకు నిష్కామ యోగమగు కర్మ ఫలత్యాగమనియు లేక సర్వసంగపరిత్యాగమనియు అర్థము కలదు . అలాగుననే తత్వబోధనము కాత్మ సాక్షాత్కారమనియు,బంధమునుండి విముక్తి గల్గుటయనియు నర్థము కలదు . పరమ రహస్యమునే గీతాశాస్త్రముపదేశించుచున్నది .
శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో రెండు రకాలైన గానాలను చేశాడు. మొదటిది వేణుగానం. శ్రీకృష్ణుని వేణుగాన్ని పశువులు పక్షులు, గోప, గోపికా జనాలు విని ఆనందించి, మధురామృతంలో వారి జీవితాలను తరింపజేసుకున్నారు. రెండో గానం గీతాగానం, ఇది యుగ యుగాలకి, దేశ కాలాతీతమైన, శాశ్వతమైన, సనాతనమైన, నిత్యనూతన మైన, సమస్త వేదాంత సారం. ఇది యావత్ప్రపంచానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది. భగవద్గీతలో దైవ ప్రకౄఎతి నిర్మా ణం. తద్వారా అస్తవ్రిద్యను స్పష్టంగా నిర్దేశించి నప్ప టికీ సూచనా ప్రాయంగా వదలి దీని కొరకు కర్మ, జ్ఞాన, భక్తి యోగాల సమన్వయమే మార్గమని చెప్పాడు.
భారత యుద్ధ సమయంలో అర్జునుడు బంధువర్గాన్ని సంహరించడానికి సంశయించాడు. సందర్భంలో శ్రీకృష్ణుడు అతనికి తత్తో్వపదేశం చేశాడు. ఉపదేశమే భగవద్గీత. ఉపదేశం, యుద్ధ ప్రారంభ దినం నాటి ఉదయం జరిగింది.
కార్తీక బహుళ అమావాస్యను భగవద్గీత పుట్టిన రోజుగా జరుపుతారు. గీతా జయంతిని ఈమాసములోనే జరపవలసి వుంటుంది. ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో మార్గశిరశుద్ధ ఏకాదశిని గీతాజయంతి జరుపుతున్నట్లు కనిపిస్తుంది. మార్గశిర శుద్ధ త్రయోదశి నుండి పుష్యశుద్ధ పాడ్యమి వరకు గల పద్ధెనిమిది రోజులు భారత యుద్ధం జరిగిందనీ, శుద్ధ త్రయోదశికి రెండు రోజుల ముందుగా, మార్గశిర శుద్ధ ఏకాదశినాడు భగవద్గీత చెప్పబడిందనీ అందుచేత రోజు గీతాజయంతి జరపడం సమంజసమని అంటున్నారు. భారతాన్ని బట్టి మాఘ శుద్ధాష్టమి భీష్ముని నిర్వాణ రోజు. భీష్ముడు అంపశయ్య మీద యాభై ఎనిమిది రోజులు ఉన్నట్లు భారతంలో స్పష్టంగా చెప్పబడింది. భీష్ముడు యుద్ధం చేసింది పదిరోజులు. భీష్ముడు మరణించిన మాఘ శుద్ధాష్టమి నుండి మొత్తం అరవై ఎనిమిది రోజులు రెండు మాసాల ఎనిమిది రోజులు. వెనక్కు లెక్కిస్తే భారతయుద్ధం ప్రారంభ దినం తేలుతుంది. గణనం ప్రకారం భారత యుద్ధం ప్రారంభ దినం కార్తీక బహుళ అమావాస్య అవుతుంది.
కార్తీకమాసంలో రేవతీ నక్షత్రంనాడు శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి పయనమై వెళ్లినట్లు భారతంలో ఉంది. కార్తీక పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం అవుతుంది. కృత్తికా నక్షత్రానికి మూడో పూర్వ నక్షత్రం రేవతి. రేవతీ నక్షత్రం నాడు అంటే, శుద్ధ త్రయోదశి నాడు అవుతుంది. రాయబారిగా వెళ్లిన శ్రీకృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులు ఉన్నాడు. వస్తూ కర్ణుడితో మాట్లాడాడు. సంభాషణలో శ్రీకృష్ణుడు కర్ణుడితో జ్యేష్ఠా నక్షత్రంతో కూడిన అమావాస్యనాడు యుద్ధం ఆరంభమవుతుందని చెప్పాడు. కాగా కార్తీక బహుళ అమావాస్యే భారత యుద్ధం ప్రారంభ దినమని నిర్ధారించి చెప్పవచ్చు.భారత యుద్ధ సమయంలో అర్జునుడు బంధువర్గాన్ని సంహరించడానికి సంశయించాడు. సందర్భంలో శ్రీకృష్ణుడు అతనికి తత్తో్వపదేశం చేశాడు. ఉపదేశమే భగవద్గీత. ఉపదేశం, యుద్ధ ప్రారంభ దినం నాటి ఉదయం జరిగింది.జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా మానవజాతికి అర్జున స్థితిలో వున్న వారికి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించాడు.
మం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మన్యయమ్
వివస్వాన్మనవే ప్రాహ మను రిక్ష్వాక వేబ్రవీత్
శ్రీభగవానుడు వినాశనం లేని యోగాన్ని పూర్వం సూర్యుడికి ఉపదేశించాడు. సూర్యుడు మనువుకూ, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు.
ఏవం పరమ్పరాప్రాప్త మిమం రాజర్షయో విదు:
సకాలేనేహ మహ తాయోగో నష్ట: పరన్తప .గీ.4-2
అర్జునా! ఇలా సాంప్రదాయపరంగా వచ్చిన కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. అయితే అది లోకంలో క్రమేపీ కాల గర్భంలో కలిసి పోయింది.
  వల్లూరి పవన్ కుమార్ 

-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ

No comments:

Post a Comment