బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులెన్నడు?
ఇటీవలి కాలంలో రాష్ట్రంలో బ్రాహ్మణజాతి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు.
చరిత్ర పొడవునా తరతరాలుగా సకల సమస్యలకు, దుర్మార్గాలకు
బ్రాహ్మణులే కారణమన్నట్లు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఈనాడున్న అన్నిరకాల అవలక్షణాలు, కులవ్యవస్థ చీడ పీడలు కూడా
బ్రాహ్మణుల పుణ్యమేనన్నట్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్రాహ్మణజాతిని
తిట్టిపోస్తున్నారు.నిజానికి ఈ సమస్యలన్నింటికి బ్రాహ్మణులే
కారణమని ఎవరైనా ఎలా అనగలరు? సకల
సమస్యలకు వ్యక్తులుగా బ్రాహ్మణులే ఎలా బాధ్యులవుతారు? కాకుం
టే..ఫ్యూడల్ రాచరిక, భూస్వామ్య వ్యవస్థలు బ్రాహ్మణిజాన్ని వ్యవస్థీకృతం చేసి తమ స్వార్థం
కోసం ఉపయోగించుకున్నట్లు చరిత్ర చెబుతున్నది. ఈ విషయాన్నే శాస్త్రీయ
పరిశోధన, అధ్యయనంతో చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడ విషయమేమం టే..
ఇవ్వాల అన్ని రకాల సమస్యలూ,
సమస్త చెడులకూ బ్రాహ్మణులే కారణమన్నట్లు చెబుతూ వ్యక్తులుగా బ్రాహ్మణులను కించ పరుస్తున్నారు. హీనంగా
మాట్లాడుతున్నారు.
దూషణలకు దిగుతున్నారు. భారతజాతిలో ప్రవేశించిన అంటరానితనం, బీదరి కం, అవిద్య,
స్త్రీల వెనుకబాటుత నం, మద్యపానం,సామాజిక
అణచివేతను అడ్డుపెట్టుకుని భారతజాతిని, సంస్కృతిని ప్రపంచం ముందు దోషిగా నిలబెడుతున్నారు.
వీటికి బ్రాహ్మణులు, బ్రాహ్మణీయమే కారణమని కొన్ని శక్తులు ప్రచారం చేస్తున్నాయి. బ్రాహ్మణులను మానసికంగా సామాజికంగా అవమానిస్తున్నారు. ఏవిధంగా చూసినా ఇలాంటి ధోరణి సమర్థనీయం కాదని
కనీస మానవీయ దృష్టితో చూసినా అర్థమయ్యేదే.
భారతదేశంలో ఆది నుంచి వివిధ
జాతుల సంతతులు మూలవాసులుగా కాలక్రమంలో వివిధ మతాల ఆచరణలో
జీవిస్తున్నా రు. కాలక్రమంలో ఆధునిక
భారతీయ సమాజం వైవిధ్యపూరితమైన నానా
సమాజాల సమ్మేళనంగా అవతరించింది.ఈ కోవలోనే బ్రాహ్మణులు
ఒక సమూహ పూజా కార్యక్రమాలను
నిర్వర్తించేందుకు ఉనికిలోకి వచ్చారు. ఇది బ్రాహ్మణులు తమ
స్వార్థం కోసం ఎంచుకున్న పని(వృత్తి)కాదు. సమష్టి జీవనంలో,
పని విభజనలో భాగంగా యాధృచ్చికంగా ఎంచుకున్న ఒక పని మాత్ర
మే. ఇంతకు మించి దీనికి
చారిత్రక, శాస్త్రీయ అవగాహన, అంచ నా మరొకటి
లేదు. ఉపఖండపు మానవ సమాజానికి బ్రాహ్మణులు
భారతీయ ప్రాచీన విద్యలను మధ్యయుగాలలో విదేశీ దాడులు, విధ్వంసకాండ నుంచి రక్షించి వారసత్వంగా
అందించారు. దేశ స్వాతంత్య ఉద్యమంలో
త్యాగాలు చేసిన ఈ బ్రాహ్మ
ణ జాతికి స్వాతంత్య్రానంతరం తగిన గుర్తింపు దక్కకపోవడమే
కాదు, వివక్షకు గురయ్యారు.
దేశ రాజకీయంలో ఓటు, మత, కు
ల, జాతి విభేద రాజకీయయాగంలో
కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా
బ్రాహ్మణ సమాజం అన్యాయానికి బలయ్యింది.
బ్రాహ్మ ణ జాతి సామాజికంగా,
రాజకీయంగా తీవ్రంగా నష్ట పోయింది. బ్రాహ్మణులు
నిలువనీడ లేకుండాకావటమే కాకుండా వారస త్వ సంపదైన
వేదశాస్త్రము, యోగశాస్త్రము, ఆయుర్వేద శాస్త్రము లాంటి ప్రజోపయోగ శాస్ర్తాలకు
ఎనలేని నష్టం జరిగింది. దీని
ఫలితంగా నేడు అల్లోపతి వైద్య
విధానంతో కార్పొరేట్ శక్తుల ఆగడాలు, దోపిడీ అందరూ అనుభవిస్తున్నదే. మరోవైపు
బ్రాహ్మణు లు సామాజిక వివక్షకు,
అణచివేతలకు గురవుతున్నారు. వారిని వృత్తులకు దూరం చేసి ఉపాధి,
విద్య, చివరికి కూటికి, గుడ్డకు, గూటికి దూరం చేశారు. ఇల్లూ
వాకిలి లేని పరిస్థితి వచ్చింది.
వర్తమాన సమాజంలో బ్రాహ్మణ జాతి కడు బీదరికం
అనుభవిస్తూ, విద్య, ఉపాధి అవకాశాలు సన్నగిల్లి
బీదరికంలో మగ్గుతున్నారు. అన్ని రకాల విద్యలకు
దూరమై నష్టపోతున్నారు.
మార్క్సిజం వేద వ్యతిరేకం కాదనీ,
మానవాళికి అభివృద్ధిపథం అనీ విజ్ఞులు అంటున్నారు.
బౌద్ధమతం సర్వమానవ సమానత్వం కోసమని చరిత్ర చెబుతున్నది. బహుజన శ్రామిక కులాలు
బ్రాహ్మణులను అవమాని స్తూ శ్రమ, ఉత్ప
త్తి సంస్కృతిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నాయి. దీన్ని బ్రాహ్మణ సమాజం గుర్తించాలి. శ్రమ
పట్ల శ్రామికుల పట్ల ఆదరణ కలిగి
జాతి ఉత్పత్తి రంగాలలో స్థానాన్ని సంపాదించుకోవాలి. జాతి మనుగడకు అంటరానితనం,
కులవివక్ష సామాజిక రుగ్మతలపై నిర్మాణాత్మకమైన పోరు ప్రారంభించి సంఘ
స్వభావాన్ని మార్చాల్సిన అవసరమున్నది.
పంచక వృత్తులవారు(విశ్వబ్రాహ్మణులు) దేవాంగ న జాతుల వారికి,
క్షత్రియ, వైశ్య జాతులతోపాటు మన
సమా జం ఉపనయ నం,
ద్విజ సంస్కృతికి ఎప్పుడో ఒప్పుకొంది. వారు ఆ సంస్కారాన్ని
నిరాటంకంగా నిర్వర్తిస్తున్నారు. స్వామి దయానంద సరస్వతి భారతజాతిలో ఉన్న ప్రతికులం, వర్ణం,
వేదమాత మననము, జపం చేయవచ్చునని చెప్పారు.
వేదయుక్తంగా ప్రామాణికాలు కూడా చూపించారు. ఇలాంటి
పరిస్థితిలో బ్రాహ్మణులం తా ఐక్యతతో పయనించాలి.
శాఖాభేదం లేకుండా సంఘటిత మ వుతూ హక్కుల
సాధనకు పోరాడాలి. ఇప్పుడు మనకు కావలసింది గత
వైభవ పునరుద్ధరణ కాదు. ఉత్పత్తిలో పాలు
పంచుకునేందుకు వీలుగా ప్రతి బీద బ్రాహ్మణ
కుటుంబానికి మూడు ఎకరాల భూమి
ఇవ్వాలి. ప్రతి బ్రాహ్మణ కుటుంబానికీ
ఇళ్లు కావాలి. దేవుడి మాన్యాలు బ్రాహ్మణులకే చెందాలి. ఆ భూములపై వచ్చిన
ఆదాయం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న
పురోహితుడికే చెందాలి. తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా పునర్నిర్మించుంటున్న తరుణంలో పేద బ్రాహ్మణుల జీవితాల్లో
వెలుగులు నిండాలి.
-గంగు ఉపేంద్రశర్మ
తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్
ప్రెసిడెంట్
- బ్రాహ్మణ సంఘం వరంగల్
అర్బన్ శాఖ
No comments:
Post a Comment