Saturday, 2 August 2014

ఫ్రెండ్ షిప్ డే

ఫ్రెండ్ షిప్ డే
స్నేహానికి ఉన్న గొప్పదనాన్ని వర్ణించటం ఎవరి తరం కాదు. స్నేహాన్ని స్వయంగా అనుభవిస్తేనే దానిలోని మాధుర్యం అర్ధం అవుతుంది. అటువంటి ఉన్నతమైన స్నేహాన్ని గురించి చెప్పటానికే స్నేహితుల రోజును జరుపుకుంటున్నారు. అయితే స్నేహితుల రోజు వెనక ఒక పెద్ద కధ ఉంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. 1935 సంవత్సరంలో ఆగస్ట్ మొదటి శనివారం రోజున అమెరికా ప్రభుత్వం చేతిలో చనిపోయిన తన స్నేహితుడిని మర్చిపోలేక అతని మరో స్నేహితుడు తరువాత రోజైన ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడుదీనికి చలించిన అమెరికా ప్రభుత్వం ఆగస్ట్ మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్ షిప్ డే  గా ప్రకటించింది. విధంగా ఇది  ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందిఒక మనిషికి సాదారణంగా బంధువులను, సొంతమైన వారిని ఎంపిక చేసుకొనే అవకాశం ఉండదు. కానీ మంచి మనస్సు ఉన్న స్నేహితులను ఎంపిక చేసుకొనే అవకాశం ఎప్పుడూ ఉంటుందని చెప్పవచ్చు. మనం పుట్టిన ఊరిని, కన్న తల్లితండ్రులను విడిచి చదువుల కోసం మరియు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు మనకు స్నేహితులే అండగా ఉంటారు. మనకు ఇంటి బెంగ లేకుండా చేస్తారు. మనం చెడు మార్గంలో ఉన్నప్పుడు మరియు తప్పు చేసినప్పుడు చక్కదిద్దేవాడే నిజమైన స్నేహితుడు. అయితే ఇప్పుడు ఫ్రెండ్ షిప్ డే ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాము. చాలా ప్రాంతాలలో స్నేహానికి గుర్తుగా ఫ్రెండ్ షిప్ బ్యాండ్ లను ఒకరి చేతికి ఒకరు కట్టుకుంటారు. చిన్నపిల్లలు అయితే వారి క్లాస్ లో ఎంత మంది ఉంటే అంత మందికి ఫ్రెండ్ షిప్ బాండ్స్ కొని కడుతూ ఉంటారు. స్నేహం కలకాలం ఉండాలని కోరుకుందాము.
వల్లూరి పవన్ కుమార్    

 - బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ 

No comments:

Post a Comment