Friday, 3 April 2015

చంద్ర గ్రహణ నిర్ణయం - చంద్ర గ్రహణం సమయం లో ఏం జరుగుతుంది



చంద్ర గ్రహణ నిర్ణయం : -
తేది 04/04/2015 శని వారం రోజున రాహు గ్రస్త చంద్ర గ్రహణం
గ్రహణం హస్తా నక్షత్రం లో సంభవిస్తున్నది కావున కన్యా రాశి వారు గ్రహణం ను చూడకుండుట మంచిది. గ్రహణ దర్శన యోగ్యమగు కాలము అంతయు పుణ్యకాలము. మేఘములచే కనిపించక పోయినను శాస్త్రములచే స్పర్శ ,మోక్ష కాలము లను తెలుసుకొని స్నాన దానములను చేయవలేను.
గ్రహణ స్పర్శ కాలము
మధ్యాహ్నం    :- 03 గం 45 ని
మధ్య కాలము  :- 05 గం 30 ని
మోక్ష కాలము
సాయంత్రం         :- 07 గం 15 ని
(గ్రహణ ఆరంభము 03 గం 45 ని అయినను పుణ్య కాలము సూర్యాస్తమయము 06:26 నుండే ప్రారంభమగును సాయంత్రం 06 గం 26 ని నుండి 07 గం 15 ని వరకు గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది )
సూర్య ఉదయం నుండి గ్రహణ వేధ ఉంటుంది చెత్ర పూర్ణిమ శనివారం నాడగుట అలభ్యయోగము.కావున ప్రాతఃకాల నియమములు నిరభ్యంతరముగా చేసుకోవచ్చు నిత్య స్నాన జపాదులు ఆచరించవచ్చు పిల్లలు ముసలివారు రోగ గ్రస్తులు అశక్తులు ... ఉదయం 10:30 లోపు భోజనం ముగించి ... గ్రహణం విడిచిన తరువాత స్నానం చేసి తిరిగి భోజనం చేయవలెను. మిగిలిన వారు మాత్రం గ్రహణం తరువాతే తినటం నియమం. గర్భిణి లు గ్రహణమును చూడరాదు,చీకటి కల గదిలో పరుండి నిద్ర పోకుండా కాళ్ళు చేతులు ఆడిస్తూ మోక్ష కాలము వరకు గడపవలెను లేనిచో గ్రహణ వేధ లోపలి శిశువు ఫై పడే అవకాశమున్నదని శాస్త్ర వచనము
( 01
గం నుండి 7గం 20 ని వరకు గర్భిణి లు జాగ్రత్తగా ఉండవలెను)
గ్రహణ గోచారం :-
కన్య -తుల-కుంభ- మిథున రాశి వారికి అథమమ్ వీరు గ్రహణమును చూడరాదు
మకర- మీన-వృషభ-సింహ రాశుల వారికి మధ్యమ ఫలితం
మేష-కర్కాటక-ధను-వృశ్చిక రాశి వారికి శుభం
గ్రహణ స్నానం కట్టిన బట్టలతోనే చేయవలెను గ్రహణ స్నానం మంత్ర పూర్వకముగా చేయనక్కరలేదు
గ్రహణ కాలమందు మంత్రం పునశ్చరణ , మంత్రోపదేశము చేయు వారికి మాస నక్షత్రాది శోధన అవసరం లేదు
గ్రహణ కాలమున విధిగా తమ తమ ఇష్ట దేవతా మంత్రమును , గాయత్రి మంత్రమును తప్పక జపించవలెను ..లెనిచొ మంత్రమునకు మాలిన్యమగును.కనుక సాధకులు శిష్యులు గమనించగలరు.
చంద్ర గ్రహణమునకు 3 యామముల వేద ఉంటుంది
గ్రహణ దోష నివారణ :-
వారి వారి జన్మ రాశి ,కుండలి అనుసరించి 3,6,11,10,రాశి యందు గ్రహణము పట్టినచో శుభం ......... 2,5,7,9 లలో మధ్యమము ......... జన్మమందు 4,8,12 స్థానములకు మంచిది కాదు. దోష నివారణకు వెండిచే చంద్ర బింబము ను సువర్ణము చే నాగ బింబము చేయించి, ఒక కంచు లేదా ఇత్తడిపాత్ర నిండా నేతిని పోసి ,నువ్వులు,కొత్త వస్త్రం దక్షిణను బ్రాహ్మణునికి దానము చేయవలెను.
(
అపాత్రా దానము,అడవి కాచిన వెన్నెల ఒక్కటే ...కనుక సద్బ్రాహ్మనునికి దానము చేయటం ఉత్తమము)
దానము ఇచ్చునపుడు " మమ జన్మరాశి జన్మనక్షత్ర స్థిత రాహు గ్రస్త చంద్ర గ్రహణ సూచిత సర్వ అరిశ్ఠ శాంతి పూర్వక ఏకాదశ స్థాన స్థితగ్రహణ సూచిత శుభ ఫలావాప్తయే బింబ దానం కరిష్యే "అని సంకల్పము చేసి ఇవ్వాలి (గ్రహణము విడిచి స్నానం చేసిన తరువాతే )
కింది శ్లోకం పఠిoచాలి
శ్లో// తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్దన/
హేమ తార ప్రదానేన మమశాంతి ప్రదోభవ //
విధుం తుద నమస్తుభ్యం సింహికానందనచ్యుత /
దానేనానేన నాగస్య రక్షమాం వేధజాద్భయాత్ //
అని నమస్కరించి
***
ఇదం సౌవర్ణం నాగం రాజతం చంద్ర బింబం వా ఘ్రుత పూర్ణ కాంస్య పాత్ర నిహితం యథా శక్తి తిల వస్త్ర దక్షిణా సహితం గ్రహణ సూచిత అరిశ్ట వినాశార్థం శుభాఫల ప్రాప్థ్యర్థమ్ తుభ్య మహం సంప్రదదే నమమ** అని పలికి బ్రాహ్మణునికి దానము ఇవ్వాలి ...
ఫై విధం గా ఉచ్చరించకుండా దానం ఇవ్వటం వాల్ల ప్రయోజనం ఉండదు అని గమనిచగలరు
 

చంద్ర గ్రహణం సమయం లో ఏం జరుగుతుంది ?
సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి అడ్డుగా రావటం వలన మనకు చంద్రుడు కనపడడు .
సూర్య కాంతి లోని  ఎర్ర రంగు తరంగాలు ఒక ప్రత్యేక కోణం లో   చంద్రుని తాకుతాయి . ఎందు  కంటే
భూ వాతావరణం సూర్య  కాంతి లోని నీలి తరంగాలను చెల్లాచెదురు చేయడం వలన ఎక్కువగా
ఎరుపు తరంగాలు చంద్రుని పై పడి , మన భూ వాతావరణం లోనికి ఒక విధమైన శక్తి తరంగాలు
పరా వర్తనం చెందు తాయి .
    మనస్సుకి సంకేత మైన చంద్రుడు ,ఆత్మకి సంకేత మైన సూర్యుడు ఒకే సరళ రేఖ లోకి రావడం ఒక విధం గా  అదొక యోగం . ధ్యాన లక్ష్యం కూడ మనస్సు ఆత్మా వైపు గా నిలిచి ఉండటమే గదా .
    సూర్య నాడి , చంద్ర నాడి కూడ ఒకే విధ మైన స్పందన లో ఉన్నప్పుడు సుషుమ్నా( - అగ్ని నాడి )బాగా పని చేస్తుంది . అనగా అగ్ని నాడి ద్వారా కుండలినీ శక్తి ప్రసరణ అతి తేలికగా జరిగే అవకాశంఉంది .
అందుకే గ్రహణ సమయం లో జప , మంత్రసాధన , ధ్యానం చేస్తే ఎక్కువ ఫలితాలు కలిగే
 అవకాశం  ఉంటుంది .
అందుకే గ్రహణం రోజున ముఖ్యం గా ఉపవాసం  లేదా సాత్విక మితాహారం,ప్రాణాయామం , వీటి ద్వారా శరీర శుద్ది జరుపు కొని భూమి పై పరిడ విల్లె కుండలినీ శక్తిని మన శరీర కోశాల లోని సుషుమ్నా నాడీ ద్వారా ప్రవహింప చేసు కొనే శక్తి పాతానికి అందరూ సమాయత్త మవ్వాలని మన ఋషుల ఆశీస్సు .
గ్రహణ కాలం లో ఆహార పదార్ధాలకు , జీవులకు హాని చేసే కిరణాలు  ఎక్కువగా భూమికి వస్తాయి .
వీటి నుమ్డి రక్షణ పొందా లంటే మన శరీర కోశాలను శుద్దమ్ గా ఉంచు కోవాలి.
అందుకే , స్నానం , దానం ,మితాహారం ,ప్రాణాయామం , దైవ స్మరణం మొదలగు గ్రహణ విధులను
అమలు చేయాలి . 

టెట్రాడ్లో మూడో బ్లడ్మూన్!
భూమి నీడ చంద్రుడిపై పడితే అది చంద్రగ్రహణం. ఇది అందరికీ తెలిసిందే. అయితే.. సూర్యకాంతి భూమికి ఇరువైపుల నుంచి చందమామపై ప్రసరించినప్పుడు ఎర్రటి కాంతి ప్రతిఫలించి చంద్రుడు రుధిర వర్ణంలో కనిపిస్తాడు. అందుకే, ఎర్రటి చంద్రుణ్ని శాస్త్రజ్ఞులుబ్లడ్మూన్గా వ్యవహరిస్తారు. ఇలాంటి బ్లడ్మూన్లు వరుసగా నాలుగు ఏర్పడితే (మధ్యలో మామూలు సంపూర్ణ, పాక్షిక చంద్ర గ్రహణాలు ఏర్పడకుండా) దాన్ని టెట్రాడ్గా వ్యవహరిస్తారు. శనివారం ఏర్పడనున్న చంద్రగ్రహణం.. అలాంటి టెట్రాడ్లో మూడోది. గత ఏడాది ఏప్రిల్ 15 టెట్రాడ్లో తొలి బ్లడ్మూన్ ఏర్పడింది. అక్టోబర్ 8 రెండోది ఏర్పడింది. ఇక, వరుసలో ఆఖరు (నాలుగో) చంద్ర గ్రహణం ఏడాది సెప్టెంబర్ 28 ఏర్పడనుంది. అంటే గత ఏడాది ఏప్రిల్ 15 నుంచి ఏడాది సెప్టెంబర్ 28 దాకా బ్లడ్మూన్లు తప్ప సాధారణ సంపూర్ణ, పాక్షిక చంద్ర గ్రహణాలేవీ లేవన్నమాటే.
వల్లూరి పవన్ కుమార్
-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ





No comments:

Post a Comment