బ్రాహ్మలు చేసిన పాపం ఏమిటి?
- బ్రాహ్మణా వ్యతిరేకులందరూ తప్పక చదివి ఆలోచించాల్సిన
ఆర్టికల్ ....!!
- ఉదయ్లాల్ పాయ్ sanskritimagazine.com
18/01/2015
TAGS:
చరిత్రలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, మారణహోమాలూ సాగించినవారిని ఆధునిక భారతం గతం గతః
అనుకుని క్షమించి వదలివేసింది. అంతకుమించి...మన సాంస్కృతిక వారసత్వ
సంపదను, జ్ఞానసంపదను పంచిపెట్టిన విశ్వవిద్యాలయాలను, సమున్నతమైన చారిత్రక కట్టడాలనూ విధ్వంసం చేసిన వారికి విలాసవంతమైన
జీవితాన్ననుభవించేందుకు కావలసిన వసతులు సమకూరుతున్నాయి. కానీ... ధర్మ పరిరక్షణకు, సమాజ
సంక్షేమానికి కట్టుబడిన బ్రాహ్మణులు మాత్రం ఆధునిక భారతావనిలో పీడనకు గురవతూనే ఉన్నారు.
గత రెండు శతాబ్దాలుగా ఈ
విధమైన బ్రాహ్మణ వ్యతిరేకవాదం సమాజంలో వేళ్లూనుకుపోయింది. ఇతరులెవరికీ విద్యాబుద్ధులు నేర్చుకునే అవకాశాన్ని బ్రాహ్మణులు ఇవ్వలేదనేది వారు చేసే వితండవాదం.
సమాజంలో తమదే ఉన్నతస్థానమని చాటుకునేందుకే
బ్రాహ్మణులు హిందూ ధర్మశాస్త్రాలను స్వయంగా
రూపొందించుకున్నారని, సమాజంలో తలెత్తిన వైపరీత్యాలకు ఈ ధోరణే కారణమైందనేది
చాలామంది మేధావుల అభిప్రాయం కూడా. అయితే ఈ
రకమైన వాదనల్లో హేతుబద్ధతగానీ, వాటికి చారిత్రక ఆధారాలుగానీ లేవు. ఒక అబద్ధాన్ని
పదేపదే చెబితే అదే నిజమవుతుందనే నానుడికి
ఇలాంటి వాదనలు అద్దం పడతాయి.
బ్రాహ్మణులు ఎప్పుడూ పేదలే. వారెప్పుడూ భారతదేశాన్ని పాలించలేదు. చరిత్రలో బ్రాహ్మణులెవరైనా ఏదైనా భూభాగాన్ని పాలించారనడానికి
చారిత్రక ఆధారమేదైనా ఉందా? (సమైక్య భారతావనికోసం చంద్రగుప్త వౌర్యుడికి చాణక్యుడు సహకరించాడు. చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాక చాణక్యుడి కాళ్లపై పడి రాజగురువుగా కొనసాగుతూ
తన ఆస్థానంలోనే ఉండిపొమ్మని వేడుకున్నాడు. అప్పుడు చాణుక్యుడు ‘నేను బ్రాహ్మణుడిని. పిల్లలకు
విద్యాబుద్ధులు గరపడం నా ధర్మం.
వారు భిక్షమెత్తుకుని తెచ్చిందే నాకు జీవనాధారం. కాబట్టి
నేను నా గ్రామానికి వెళ్లిపోవడమే
ధర్మం’ అని జవాబిచ్చాడు). పురాణాల్లోగాని,
చరిత్రలోగానీ ధనవంతులైన బ్రాహ్మణులు ఉన్న ఉదంతాన్ని ఒక్కటైనా
చెప్పగలరా? కృష్ణ భగవానుడి జీవితగాథలో
సుధాముడి (కుచేలుడు)కి ప్రత్యేక స్థానం
ఉంది. సుధాముడు పేద బ్రాహ్మణుడు కాగా
కృష్ణుడు యాదవుడు. ప్రస్తుతం యాదవులు ఇతర వెనుకబడిన కులాల
(ఓబిసి) జాబితాలో ఉన్నారన్నది గమనార్హం. బ్రాహ్మణులు అహంభావానికి ప్రతీకలే అయితే తమకంటే తక్కువ
కులాలకు చెందిన దేవుళ్ళని వారెందుకు పూజిస్తారు? భోళా శంకరుణ్నే తీసుకోండి.
ఆయన కిరాతుడని పురాణాలు చెబుతున్నాయి. కిరాతులు ఇప్పుడు ఎస్టీలుగా కొనసాగుతున్నారు.
మతపరమైన ఆచారాల నిర్వహణ బాధ్యతలు చేపట్టే పౌరోహిత్యం-బ్రాహ్మణుల సాంప్రదాయకమైన వృత్తి. భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చే భిక్షతో వారు
జీవితం గడిపేవారు. బ్రాహ్మణుల్లోనే మరో శాఖకు చెందినవారు
వేతనమేమీ లేకుండానే ఆచార్యులు (ఉపాధ్యాయులు)గా కొనసాగేవారు. మరి..ఇవే సమాజంలో అత్యున్నతమైన
పదవులా? వాస్తవానికి దళితులను అణగదొక్కింది భూస్వాములే తప్ప బ్రాహ్మణులు కారు.
ఓబిసీలు సైతం దళితులను అణగిదొక్కినవారే.
కానీ నింద పడింది మాత్రం
బ్రాహ్మణులపైన. బ్రాహ్మణుల్లో పౌరోహిత్యం చేసేవారు 20శాతానికి మించరన్న నిజం ఎంతమందికి తెలుసు?
చదువుకోవద్దని బ్రాహ్మణులు ఎవరినీ ఆదేశించలేదే? ఆ మాటకొస్తే జ్ఞాన
సముపార్జనే వారి ఆశయం. ఇదే
వారిని శక్తిమంతుల్ని చేసింది. ఇతరులు అసూయ చెందడానికీ ఇదే
కారణం. ఇందులో తప్పెవరది? చదువు సంధ్యలనేవి బ్రాహ్మణులకు
మాత్రమే పరిమితమైనవైతే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎలా రాయగలిగాడు? తిరువళ్లువార్
తిరుక్కురళ్ను ఎలా లిఖించగలిగాడు?
ఇతర కులాలకు చెందిన ఎందరో సాధుసంతులు భక్తిపరమైన
రచనలెన్నో చేశారుకదా? మహాభారతాన్ని రాసిన వేద వ్యాసుడు
ఓ మత్స్య కన్యకు జన్మించినవాడుకాదా? వశిష్టుడు, వాల్మీకి, కృష్ణుడు, రాముడు, బుద్ధుడు, మహావీరుడు, తులసీదాసు, కబీర్, వివేకానంద...వీరంతా బ్రాహ్మణేతరులే. వీరు చేసిన బోధనలను
మనమంతా శిరోధార్యంగా భావించడం లేదా? అలాంటప్పుడు ఇతరులు
విద్యార్జన చేసేందుకు బ్రాహ్మణులు అంగీకరించేవారు కారన్న వాదనకు హేతువెక్కడ? మనుస్మృతిని రచించిన మనువు బ్రాహ్మణుడు కాడే!
ఆయన ఓ క్షత్రియుడు. కుల
వ్యవస్థను వివరించి చెప్పిన భగవద్గీతను రచించినది వ్యాసుడు. ప్రాచీన గ్రంథాలన్నీ బ్రాహ్మణులకే ఉన్నత స్థానమిచ్చాయి. అందుకు
కారణం వారు ధర్మాన్నీ, విలువలనూ
పాటించడమే.
అరేబియానుంచి వచ్చిన ఆక్రమణదారులు బ్రాహ్మణుల తలలు నరికారు. గోవాను
దురాక్రమించిన పోర్చుగీసువారు బ్రాహ్మణులను శిలువ వేశారు. బ్రిటిష్
మిషనరీలు అనేక వేధింపులకు గురిచేశాయి.
ఇప్పుడు సోదర సమానులైన స్వదేశీయులే
వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎవరైనా
తిరగబడ్డారా? వారణాసి, గంగాఘాట్, హరిద్వార్ ప్రాంతాల్లో నివసించే 1,50,000మంది బ్రాహ్మణులను ఔరంగజేబు
ఊచకోత కోశాడు. పది మైళ్ళ దూరంనుంచి
చూస్తే కూడా కనబడే విధంగా
వారి తలలను తెగ్గొట్టి గుట్టగా
పోశాడు. ఇస్లాం మతం స్వీకరించనందుకు ఔరంగజేబు
బ్రాహ్మణుల తలలు తెగనరికి, వారి
జంధ్యాలను తెంచి వాటిని ఒకచోట
చేర్చి నిప్పంటించి చలి కాచుకున్నాడు. కొంకణ్-గోవా ప్రాంతంలో మతం
మారేందుకు నిరాకరించినందుకు పోర్చుగీసు దురాక్రమణదారులు లక్షలాది కొంకణ్ బ్రాహ్మణుల్ని ఊచకోత కోశారు. ఒక్క
బ్రాహ్మణుడైనా తిరగబడి పోర్చుగీసువారిని చంపిన దృష్టాంతముందా? (్భరత్కు పోర్చుగీసువారు వచ్చినపుడు
సెయింట్ జేవియర్.. పోర్చుగీస్ రాజుకు ఓ ఉత్తరం రాశాడు.
దాని సారాంశమేమిటంటే... ‘ఇక్కడ బ్రాహ్మణులెవరూ లేకపోతే
అందర్నీ సునాయాసంగా మన మతంలోకి మార్చేయవచ్చు’
అని). సెయింట్ జేవియర్ బ్రాహ్మణులను విపరీతంగా ద్వేషించేవాడు. జేవియర్ వేధింపులు భరించలేక వేలాది కొంకణ బ్రాహ్మణులు సర్వస్వం
వదలుకుని కట్టుబట్టలతో గోవాను వదలి వెళ్లిపోయారు.
కాశ్మీర, గాంధార దేశాల్లో (ఇప్పటి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లోని భాగాలు) సారస్వత బ్రాహ్మణులను విదేశీ ఆక్రమణదారులు ఊచకోత కోశారు. ఇప్పుడు
ఈ ప్రాంతాల్లో సారస్వత బ్రాహ్మలు మచ్చుకైనా కనిపించరు. ఇంతలా మారణహోమం జరుగుతున్నప్పుడు
ఏ ఒక్క సారస్వత బ్రాహ్మడైనా
తిరగబడిన దాఖలాలు ఉన్నాయా?
(పాకిస్తానీ మిలిటెంట్ల దురాగతాలకు తాళలేక కాశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలను వదిలి
వెళ్లిపోయారు. ఉగ్రవాదులు చేపట్టిన కాశ్మీరీ లోయ ‘ప్రక్షాళన’ కార్యక్రమానికి
తాళలేక కాశ్మీరీ పండిట్లు విలువైన తమ ఆస్తిపాస్తులనే కాదు...ప్రాణాలనూ కోల్పోయారు. ఐదు లక్షలమందికి పైగా
పండిట్లు కాశ్మీర్ లోయను వదలిపెట్టి వలస
పోయారు. వీరిలో 50వేలమందికి పైగా ఇప్పటికీ శరణార్థి
శిబిరాల్లోనే కాలం గడుపుతున్నారు. కాశ్మీరీ
పండిట్లు ఇంత పీడనకూ, వేదనకూ
గురైనా ఎన్నడైనా తిరగపడిన ఉదంతాలు ఉన్నాయా?)
భారత్పైకి అరబ్బు దేశంనుంచి
దండెత్తి వచ్చిన మహమ్మద్ బీన్ ఖాసిం బ్రాహ్మణులంతా
సున్తీ చేయించుకోవాలని షరతు విధించాడట. వారు
నిరాకరించినందుకు పదిహేడేళ్ల వయసు పైబడిన బ్రాహ్మణులకు
మరణశిక్ష విధించేవాడట. ముస్లిం చరిత్రకారులను ఉటంకిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత
డాక్టర్ అంబేద్కర్ చెప్పిన వాస్తవమిది. భారత్పై దండయాత్రలు
జరిగిన సమయాల్లోనూ, మొఘలుల కాలంలోనూ వందలు, వేలమంది బ్రాహ్మణులు ఊచకోతకు గురయ్యారు. కానీ...బ్రాహ్మణులు తిరగబడిన ఉదంతాలు ఒక్కటీ కనబడవు.
19వ శతాబ్దం తొలినాళ్లలో ఓ దీపావళి రోజున
టిప్పు సుల్తాన్ సైన్యం మేల్కోటే ప్రాంతంపైకి దండెత్తివచ్చి 800 మందిని ఊచకోత కోసింది. మృతుల్లో
అత్యధికులు మాం డ్యం అయ్యంగార్లే.
సంస్కృతంలో ప్రవీణులు వారు. (ఇప్పటికీ మేల్కోటేలు దీపావళి పండుగ జరుపుకోరు). వారణాసిలో
రిక్షా తొక్కేవారిలో చాలామంది బ్రాహ్మణులనే విషయం ఎంతమందికి తెలుసు?
ఢిల్లీ రైల్వే స్టేషన్లలో బ్రాహ్మణులు కూలీలుగా పనిచేస్తున్నారనే సంగతి తెలిస్తే చాలామందికి
ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజం.
న్యూ ఢిల్లీలోని పటేల్నగర్లో
నివసించే రిక్షా కార్మికుల్లో 50శాతం మంది బ్రాహ్మణులే.
ఆంధ్రప్రదేశ్లో ఇళ్లలో పనిచేసేవారు,
వంటవాళ్లలో 75శాతం మంది బ్రాహ్మణులే.
మన దేశంలో 60శాతం మంది బ్రాహ్మణులు
పేదరికంలో మగ్గుతున్నారు. వేలాది బ్రాహ్మణుల పిల్లలు ఉద్యోగాల వేటలో అమెరికాకు వలస
పోతున్నారు. అక్కడ సైంటిస్టులుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడుతున్నారు.
మన దేశంలో నిపుణుల కొరత ఉన్నప్పుడు ప్రభుత్వాలు
వారిగురించి ఎందుకు ఆలోచించడం లేదు? గత కాలపు
బ్రాహ్మణ సమాజం మొత్తం పులుకడిగిన
ముత్యం కాకపోవచ్చు. వారిలో ఏ కొద్దిమంది చేతులకో
రక్తం అంటి ఉండవచ్చు. వారు
చేసిన తప్పులను మొత్తం బ్రాహ్మణులందరికీ అంటగట్టడం సబబేనా?
సమాజానికి బ్రాహ్మణులు చేసిన మేలును ఈ
ప్రపంచం ఏనాడో మరచిపోయింది. బ్రాహ్మణులు
కేవలం వేదాలు, గణిత, ఖగోళ శాస్త్రాల
అధ్యయనానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయుర్వేద, ప్రాణాయామ, కామసూత్ర, యోగ, నాట్య శాస్త్రాలను
అభివృద్ధి చేసి మానవాళికి అందించిన
ఘనత నిస్సందేహంగా వారిదే. బ్రాహ్మణులు స్వార్ధపరులే అయితే, విలువైన ఈ శాస్త్రాలన్నిటిమీద హక్కు తమదే
అని చాటుకునేవారు. అతి ప్రాచీనమైన శాస్త్రాలపై
తమ పేర్లు లిఖించుకుని ఉండేవారు. ‘లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు’ అనే ఒకే ఒక్క
ఆశయంతో మానవాళి సంక్షేమంకోసం తమ జీవితాలను త్యాగం
చేశారు. అందుకు ప్రతిఫలంగా బ్రాహ్మణుల్ని శిలువపైకి ఎక్కించేందుకు ఈ లోకం ప్రయత్నిస్తోంది.
ఎంత విచారకరం!
- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment