కార్తీకపురాణం మూడో అధ్యాయము
: కార్తీక మాస స్నాన మహిమ
వశిష్టుడు తిరిగి ఇలా చెబుతున్నాడు…. ”జనక
మహరాజా! కార్తిక మాసంలో చిన్న దానము చేసినా…
అది గొప్ప ప్రభావాన్ని చూపి,
సకల ఐశ్వర్యాలను కలుగజేస్తుంది. అంతేకాకుండా… మరణానంతరం శివసాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుంది. అయితే కొందరు అస్థిరములైన
భోగభాగ్యాలను విడువలేక, కార్తిక స్నానములు చేయక, అవినీతి పరులై,
భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు
అనగా కోడి , కుక్క, పిల్లి గ జన్మింతురు.. అయితే
దాన ధర్మాలు చేయలేకపోయినా…. కార్తీక మాస శుక్ల పార్ణమి
రోజున తప్పనిసరిగా స్నాన, దాన, జపతపాదులు చేయాలి.
ఆ రోజు స్నానం చేయనివారు
చండాలాది జన్మలెత్తి, చివరకు బ్రహ్మరాక్షసిగా పుడతారు. దీన్ని గురించి నాకు తెలిసిన ఒక
ఇతిహాసాన్ని వినిపిస్తాను… సవివరంగా విను…” అని ఇలా చెప్పసాగాడు.
బ్రహ్మ రాక్షసులకు ముక్తి
దక్షిణభారత దేశంలోని ఓ గ్రామంలో మహావిద్వాంసుడొకడుండేవాడు.
తపోశక్తి సంపన్నుడై, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడైన ఆ బ్రాహ్మడి పేరు
తత్వనిష్ఠుడు. ఒకరోజా బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయాలని సంకల్పించాడు. అఖండ గోదావరికి వెళ్లాడు.
ఆ తీర్థ సమీపంలో ఓ
మహావటవృక్షంపై భయంకర ముఖంతో, పొడవైన
జుట్టు, బలిష్టమైన కోరలు, నల్లని బాన పొట్టతో చూసేవారికి
అతి భయంకరంగా కనిపించే మూడు బ్రహ్మరాక్షసులున్నాయి. ఆ మార్గం
మీదుగా వెళ్లే బాటసారులను బెదిరించి, వారిని భక్షించడం వాటి ప్రధాన విధి.
మూడు బ్రహ్మర్షాసుల వల్ల ఆ ప్రాంతంలో
భయోత్పాతాలేర్పడ్డాయి. తీర్థయాత్రల్లో ఉన్న ఆ బ్రాహ్మణుడు
గోదావరిలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి
సన్నద్ధమవుతుండగా… యథావిధిగా చెట్టు నుంచి దిగిన బ్రహ్మర్షాసులు
అతన్ని చంపేందుకు యత్నించాయి. ఆ బ్రాహ్మణుడు భీతిచెంది…
భయంతో నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించాడు. ‘ప్రభో… ఆర్తత్రాణ పరాయణా! అనాథరక్షకా… ఆపద్భాందవా… గజేంద్రుడిని, ద్రౌపదిని, ప్రహ్లాదుని రక్షించిన రీతిలో నన్నూ ఈ పిశాచాల
బారి నుంచి కాపాడు తండ్రీ!”
అని వేడుకొన్నాడు. నారాయణ మంత్రంతో కూడిన ఆ ప్రార్థనలు
విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయమైంది. ”మహానుభావా… మీ నోటి నుంచి
వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతిని విని మాకు జ్ఞానోదయమైంది.
మమ్మల్ని రక్షించండి” అని ప్రాధేయపడ్డాయి.
అంతటితో కాస్త ధైర్యం తెచ్చుకున్న
తత్వనిష్ఠుడు మెల్లగా వాటితో ఇలా మాట్లాడసాగాడు… ”ఓయీ…
మీరెవరు? మీకు ఈ రాక్షసరూపం
ఎలా వచ్చింది? మీ కథేంటి?” అని
ప్రశ్నించాడు.
దీనికి ఆ బ్రహ్మరాక్షసాలు ఇలా
చెప్పసాగాయి… ”ఓ విప్రపుంగవా! మీరు
పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శనభాగ్యం వల్ల
మాకు పూర్వజన్మలోని కొంత జ్ఞానం కలిగింది.
మీకు మా వల్ల ఏ
అపాయం కలుగదు.” అంటూ ఒక బ్రహ్మరాక్షసుడు
తన కథను వివరించసాగాడు.
”నాది ద్రావిడ దేశం. బ్రహ్మనుడను. నేను
మహా పండితుడనని గర్వంతో విర్రవీగేవాడిని. న్యాయాన్యాయ విచాక్షణలు మాని, పశువువలె ప్రవర్తించాను.
బాటసారులు, అమాయక గ్రామస్తుల వద్ద
దౌర్జన్యంగా దనం లాక్కొన్నాను. దుర్వ్యసనాలకు
లోనై… భార్య, పుత్రులను సుఖపెట్టక, పండితులను అవమానపరుస్తూ… లోకకంటకుడిగా ఉండేవాడిని. అయితే… ఓ బ్రాహ్మణుడు కార్తీక
మాస వ్రతాన్ని ఆచరిస్తూ భూత తృప్తికోసం బ్రాహ్మణ
సమారాధన చేయాలనే ఉద్దేశంతో పదార్థ సంపాదన నిమిత్తం నగరానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా
వచ్చాడు. అయితే… నేను ఆ పండితుడిని
దూషించాను. కొట్టి, అతని వద్ద ఉన్న
ధనం, వస్తువులు తీసుకుని, ఇంటి నుంచి గెంటేశాను.
దీంతో దు:ఖంతో పాటు,
కోపాన్ని వ్యక్తం చేసిన ఆ బ్రాహ్మణుడు
తనన్ను రాక్షసుడవై నరమాంస భక్షణ గావించాలని శపించాడు.
బ్రహ్మాస్త్రమునుంచైనా తప్పించుకోవచ్చు కానీ, బ్రాహ్మణ శాపం
తప్పించడం ఎవరితరమూ కాదు. దీంతో క్షమించమని
అతన్ని ప్రార్థించాను. అప్పుడు గోదావరీ తీరంలోని వటవృక్షంపై నివసించమని చెప్పాడు. ఒక బ్రాహ్మణుడి వల్ల
పునర్జన్మ జ్ఞానం పొందుతావని, ఆ బ్రాహ్మణుడే నిన్ను
కాపాడతాడని చెప్పాడు” అని మొదటి రాక్షసుడు
తన వృత్తాంతాన్ని వివరించాడు.
ఇక రెండో రాక్షసుడు ”ఓ
ద్విజోత్తమా…! నేను కూడా పూర్వజన్మలో
బ్రాహ్మనుడనే. నేను నీచుల సహవాసంతో
తల్లిదండ్రులను బాధించాను. వారికి తిండిపెట్టకుండా, మాడ్చి, అన్నమోరామచంద్రా అనేలా చేశాను. వారు
ఆకలితో అలమటిస్తుంటే… నేను వాళ్ల ఎదుటే
భార్యాపిల్లలతో పంచభక్ష్య పరమాన్నాలు తిన్నాను. నేను ఎలాంటి దానధర్మాలు
చేయలేదు. నా బంధువలను కూడా
హింసించాను. వారి ధనాన్ని అపహరించి
రాక్షసుడిలా ప్రవర్తించాను. ఇదే నా రాక్షస
జన్మకు కారణం. నన్నీపాపం నుంచి ఉద్దరించు” అని
ప్రార్థించెను.
మూడో రాక్షసుడు కూడా తన వృత్తంతమును
వివరిస్తూ… ”ఓ మహానుభావా! నేనొక
సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయములో
అర్చకునిగా పనిచేసేవాడిని. స్నాన మైనను చేయక,
కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండే వాడిని. భగవంతునికి ధూప దీప నైవేద్యము
లైనా సమర్పించక, భక్తులు తీసుకొచ్చే వస్తువులు, ధనాన్ని నా ఉంపుడుగత్తెకు ఇచ్చేవాడిని.
మధ్యమాంసాలను సేవించి పాపాలను మూటకట్టుకున్నాను. అందుకే ఈ రూపాన్ని మూటగట్టుకున్నాను.
కాబట్టి నాపై దయుంచి విముక్తిని
కలిగించు” అని ప్రార్థించెను.
తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచముల
దీరగాథలె విని ”ఓ బ్రహ్మ
రాక్షసులరా! భయపడండి. మీరు పూర్వ జన్మలో
చేసిన ఘోర అపచారాల వల్ల
మీకీ రూపములు కలిగెను. నా వెంట రండి
మీకు విముక్తిని కలిగింతును” యని, వారిని ఓదార్చి…
తనతో తీసుకెళ్లాడు. ఆ ముగ్గురితో చేతనవిముక్తి
సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో
స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున
ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా… ఆ ముగ్గురూ వారి
రాక్షస రూపాన్ని వదిలి, దివ్యమైన రూపాలను ధరించారు. శాపవిమోచనమవడంతో ఆ ముగ్గురూ వైకుంఠానికి
వెళ్లారు.
తిరిగి వశిష్టుడు ఇలా చెబుతున్నాడు ”ఓ
జనక మహారాజా! కేవలం గోదావరి నదిలో
స్నానమాచరించిన ఫలితం వారికి శాపవిముక్తిని
గావించింది. ఈ కార్తీకమాసంలో నదీస్నానం
ఎంతో ఫలితాన్నిస్తుంది. ఎంతటి కష్టాలెదురైనా… ఈ
మాసంలో స్నానాలు ఆచరించాలి” అని వివరించారు.
ఇతి స్కాంధ పురాణే తర్గత, వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం… తృతీయోధ్యాయం సంపూర్ణం.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య
వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment