భగినీ హస్త భోజనం సోదరి
ఇంట భోజనం చేయాలి
కార్తీక
శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్ళిన
రెండవనాడు వస్తుందీ పండుగ. సోదరీ సోదర ప్రేమకి
అద్దం పట్టే పండుగల్లో రాఖీ
పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది. ఈనాడు అన్నదమ్ములు
తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు
వెళ్ళి వారి చేతివంట తిని
వారిచేత తిలకం దిద్దించుకుంటారు. రక్షాబంధనంలో
అన్నదమ్ములు తమ సోదరి రక్ష
(రాఖీ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము
చూస్తామని, రక్షిస్తామని చెపుతారు. రాఖీ సోదరి క్షేమానికి
సంబంధించినది.
"భయ్యా ధూజీ'' అనే పేరుతొ ఉత్తరదేశంలో
బాగా ప్రాచూర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని
క్షేమానికి సంబంధించినది.
ఒకప్పుడు యముడు తన భటుల్ని
కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా? అని
అడిగితె ఒక భటుడు భర్త
ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ
విదారకంగా ఉండి తన మనసు
పాడైందని చెపుతాడు. యముడు కూడా బాధపడినా
చేయగలిగిందేమీ లేదని చెపుతూ ... "ఎవరైనా
కార్తీక శుద్ధ విదియ నాడు
సోదరికి బహుమానాలిచ్చి, ఆమె చేతితో తిలకం
పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు'' అంటాడు. దీనికి కారణం ఉంది.
యముడు యమున సూర్యుని పిల్లలు.
సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే
తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో
వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట. అందువల్లనే
యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యు
బాధ ఉండదట. అందరూ యమునా స్నానం
చేయలేరు కదా! సోదరసోదరీ పరమకు
నిదర్శనంగా నిలిచినా యమున, యముల బంధాల్ని
గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు
భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే
అదే ఫలితాన్ని పొందవచ్చు. ఉత్తర భారతంలో ఇది
చాలా ప్రాంతాలలో జరుపుకునే పండుగ. ఆంధ్రులకు దానిని గురించి తెలిసినా పెద్దగా పాటించరు. రక్షాబంధనం కూడా అంతే ఈ
మధ్య ప్రాంతీయ భేదాలు సమసిపోవటం కారణంగా ఇవి మన దాకా
కూడా వచ్చాయి. కాని, రాఖీ పూర్ణిమ
ప్రాచుర్యం పొందినంతగా భగినీ హస్తభోజనం ఆంధ్రదేశంలో
వ్యాప్తి పొందలేదు.
వల్లూరి పవన్ కుమార్
-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment