Wednesday, 9 March 2016

అంతర్జాతీయ మహిళా దినోత్సవం [8 Mar International Women’s Day]

http://www.vipravanam.com/
వెనకటికి ఒకాయన “నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి” అంటే మరికొందరు “స్త్రీబుధ్ధీ ప్రళయాంతకం” అంటూ అసలు ఆడవాళ్ళకు బుధ్ధే లేదని చెప్పజూశారు. కొద్దికాలానికి మరొకాయన “కార్యేషు దాసీ, కరణేషు మాతా” అంటూ ఆమెకుండాల్సిన లక్షణాలను వివరించాడు. ఆతర్వాత. ఇంకోగురువుగారు “వాళ్ళు పుట్టిందే నీకు సేవచేయడాన్నికంటూ” ప్రవచిస్తే మరో పెద్దాయన “వాళ్ళు నీకెన్నటికీ సమానం కారన్నాడు”
యుగాలు, కాలాలు, తరాలు మారుతున్నకొద్దీ ఆమెపట్ల కరుడుగట్టిన దృక్పధంలో వచ్చింది. ఆమె ఉనికిని గుర్తించినా, స్థానాన్ని అంగీకరించినా తన స్థాయికి సమానమని మాత్రం ఒప్పుకోవడం లేదు.
ఆకాశంలో సగం నీదే అంటూ పట్టాలు రాసిచ్చినా ఆమ్నియోసెంటేసిస్ హత్యలూ, ముళ్లపొదల్లోనూ, మున్సిపల్ డ్రైనేజీల్లో వదలడాలూ, ఆసిడ్ ప్రేమలూ, అక్రమరవాణాలూ, అందరూ ఉండికూడా అనాధ శరణాలయాలకి వదిలేయడాలు జరిగిపోతూనే ఉన్నాయి.
‘వాళ్ళు చట్టసభలో 33% కాదు కనీసం 12%మందికూడా లేర’ని మన దేశ ప్రధమ పౌరుడు ఆవేదన చెందాడు. చట్టసభలో చక్రం తిప్పే పెద్దాయన కనీసం మహిళాబిల్లు మాటకూడా ఎత్తలేదు.
లింగ సమానత్వమంటూ వస్తే, గిస్తే క్రీస్తు శకం 2095 తర్వాతప్రారంభమై 2133 వరకు పూర్తిస్థాయికి చేరుకోవచ్చునని World Economic Forum (అంటే మరో 80 ఏళ్ళకన్న మాట) అంచనా వేసి, ఆ లక్ష్యసాధనకోసం కార్యాచరణ ఇప్పటినుండే ప్రారంభం కావాలని సూచించింది.
అందుకోసం లింగ సమానత్వ ప్రతిజ్ఞచేసూ, అవగాహన పెంచుతు, ఆచరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తి కేవలం పురుషులకు మాత్రమే పరిమితం కాదు. స్త్రీ పురుషులిరువురూ చేయాలి. ఎందుకంటే అనేక సందర్భాల్లో అత్తకు కోడలు, కోడలికి అత్తా సమానం కారు. ఇల్లాలికి ఆడపడచులూ, వైస్ వర్సా సమానంగా చూడలేకపోతున్నారు.
ఈ ప్రతిజ్ఞను ప్రతీ కార్యాలయం, విద్యాలయం, పబ్లిక్ ప్లేసులతోపాటు ఇంట్లోకూడా రాసిపెట్టుకుంటే మంచిది. ఈ ప్రతిజ్ఞనలా వేలాడదీయడం మాత్రమే కాకుండా ఆచరించాలి.
ప్రతిజ్ఞ
నేను బాలికలు, స్త్రీలు తమ లక్ష్యాలను, ఆకాంక్షలను చేరుకోవడంలో తోడుంటాను.
నా చేతనాచేతనావస్థలేవైనా స్త్రీలపట్ల వివక్ష ప్రదర్శించను
నేను లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే నాయకత్వానికే మద్దతిస్తాను.
నేను స్త్రీల సేవలను పురుషుల సేవలకు సమానంగా గౌరవిస్తాను
నేను అంతర్గ్రాహ్య మార్గదర్శకత్వంతో మహిళా సమానత్వంకోసం సర్ధుకుపోయే ధోరణితో వ్యవహరిస్తాను.
ఈ సందర్భంగా (వాస్తవానికి ఏ సందర్భంలోనైనా) కాళోజీ మాటలను స్మరించుకోవాలి.
“నా ఒక్కసిరా చుక్క లక్షమెదళ్ళకు కదలిక’ లార్డ్ బైరన్ మాటలనుటంకిస్తూ ప్రజాకవి కాళొజీ
“మరి నేనొలకబోసిన సిరా సీసాలకొద్దిగాదు పీపాలకొద్దీ
ఏఒక్క మెదడు కదిలినట్టు లేదు –
మొదట నా మెదడులో ఉంటేగా కదలిక- మరోమెదడును కదిలింఛడానికి’
ముఖ పుస్తక మిత్రులందరికీ మరొకమారు “అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభకాంక్షలు”
    వల్లూరి పవన్ కుమార్

- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ





No comments:

Post a Comment