Sunday, 21 February 2016

మాఘ పౌర్ణమి

http://www.vipravanam.com/
     మహా మాఘి ........... మాఘ పౌర్ణమిచాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమి నాడు నక్షత్రంలో ఉంటే మాసానికి నక్షత్రం పేరు వర్తిస్తుంది. పౌర్ణమి నాడు మఘ నక్షత్రం ఉండుట వలన మాసానికి మాఘమాసం అని పేరువచ్చిం.
''అకార్తీక మాసం దీపానికెంత ప్రాధాన్యత ఉందో మాఘమాసంలో స్నానానికంత ప్రాశస్త్యం. మాఘమాసం సంవత్సరానికి సంధ్యా సమయమంటారు. ఈమాసంగురించి పద్మపురాణంలో వివరంగా ఉంది.
    మాఘస్నానం చిరాయువు, సంపద, ఆరోగ్యం, సౌజన్యం, సౌశీల్యం, సత్సంతానం కలగచేస్తుంది. 'తిల తైలేన దీప శ్చయా: శివగృహే శుభా:' అని శివ పురాణం పేర్కొంది. దీన్నిబట్టి శివాలయంలో ప్రదోషకాలంలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. సంవత్సరంలో ఇది పదకొండో మాసం. గృహనిర్మాణాలు ప్రారంభిస్తే మంచిది. మాసంలో ఆదివారాలు విశేషమైనవి. ఆదివారాల్లో స్నానా నంతరం సూర్యుడికి అర్ఘ్యమివ్వడంతో పాటు సూర్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించడం, ఆదివార వ్రతం చేయడం మంచిది. ఆదివారాలు తరిగిన కూరగాయలు తినకూడదంటారు.
   తెలుగునాట మాఘపాదివారాల్లో స్త్రీలు నోము నోచుకుంటారు. నెల్లో వచ్చే నాలుగాదివారాలు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గు పెట్టి సూర్యోదయ సమయానికి సూర్యారాధన చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు.
       యజ్ఞంలో అశ్వమేధం, పర్వతాల్లో హిమాలయం,వ్రతాల్లో సత్యనారా యణస్వామి వ్రతం, దానాల్లో అభయదానం, మంత్రాల్లో ప్రణవం, ధర్మాల్లో అహింస, విద్యల్లో బ్రహ్మవిద్య, ఛందస్సులో గాయత్రీ, ఆవుల్లో కామధేనువు, వృక్షాల్లో కల్పతరువు ఎంతగొప్పవో స్నానాల్లో మాఘ స్నానం అంత మహిమాన్వితమైంది. సూర్యుడు మకరరాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో, ఆనాటి నుంచి ప్రాత:స్నానం తప్పక చేయాలి. నదులు, చెరువులు, సముద్రతీరాలదగ్గర లేదా బావివద్దా స్నానంచేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని పద్మ పురాణం స్పష్టం చేస్తోంది.
      ప్రతిరోజూ పర్వదినమే: మాసంలో ప్రతిరోజూ పవిత్రమైనవే. శుద్ధ విదియ త్యాగరాజస్వామి ఆరాధన చేస్తే, తదియనాడు ఉమాపూజ, లలితా వత్రం చేయాలంటుంది చతుర్వర్గ చింతామణి. చవితిరోజు ఉమాదేవిని, గణపతిని పూజించాలంటారు. ఇక పంచమిని శ్రీపంచమనీ, మదన పంచ మని కూడా వ్యవహరిస్తుంటారు. ఇది సరస్వతీదేవి జన్మదినం. సర్వత్రా చదువుల తల్లిని, రతీ మన్మధుల్ని పూజిస్తారు. రోజున వసంతోత్సవ ఆరంభం అనీ, పంచాంగ కర్తలు వసంత పంచమిని ఉదహరిస్తారు. షష్ఠి రోజున మందార షష్ఠి, వరుణ షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు.
      ఇక మాఘశుద్ధ సప్తమే 'రథసప్తమి'గా జరుపుకుంటారు. రోజు సూర్యుని పూజించాలి. అష్టమిని భీష్మాష్టమిగా జరుపుకుంటారు. రోజు భీష్ముడిని పూజించటం సత్ఫలితాలనిస్తుంది. నవమిని మహానంద నవమి అని, స్మృతి కౌస్త్తుభం, నందినీదేవి పూజ చేయాలని చతుర్వర్గచింతామణి చెబుతుంది. ఇక ఏకాదశినాడే పుష్యవంతుడనే గంధర్వుడు ఉపవసించి శాపవిముక్తయ్యాడు. ఈనాడే గోదావరి సాగరసంగమమైన అంతర్వేదిలో శ్రీమహాలక్ష్మీ నరసింహాస్వామి వారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.
      భీముడు ఏకాదశీవ్రతం చేసి, కౌరవులను జయించిందీ రోజే. శుద్ధ ద్వాదశినాడు వరాహ రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువునీ భక్తి ప్రపత్తులతో అర్చిస్తారు. త్రయోదశిని విశ్వకర్మ జయంతిగా పాటిస్తారు. విశ్వకర్మ దేవశిల్పి కావటంతో మహాపురుషుడిగా భావిస్తారు. మాఘ పౌర్ణమి అన్ని రోజుల్లోకెల్లా అత్యంత శ్రేష్ఠమైనది. దీన్ని 'మహామాఘి' అని కూడా పిలుస్తారు.
      బహుళ పాడ్యమినాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు. ఇక శ్రీరాముడు రావణ సంహారంకోసం లంకవెళ్ళేందుకు సేతునిర్మాణం బహుళ ఏకాదశి నాడే పూర్తి అయిందంటారు. ద్వాదశి ముందురోజు ఉపవాసముండి ద్వాదశినాడు నువ్వులు దానమిచ్చి, తలస్నానం చెయ్యాలంటారు. అందుకే దీన్ని తిలద్వాదశీ వ్రతం ఆచరిస్తారు.
      ధర్మశాస్త్ర పురాణ తిహాసాలు నేర్చుకునేందుకు త్రయోదశి మంచిరోజని చెబుతారు. బహుళ చతుర్దశి మహాశివరాత్రి. పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవ శుభదినం. ఈనాడు భక్తిశ్రద్ధలతో మనస్సును లగ్నం చేసి ఏకాగ్రతతో మహాశివుణ్ని ఎవరైతే స్మరిస్తారో వారికా పరమేశ్వరుడు తప్పక మోక్షాన్ని ప్రసాదిస్తాంటారు. ఉపవాసం, జాగరణకు ప్రశస్తమైన రోజిది. అమావాస్య స్వర్గస్తులైన పితరులకు తర్పణం వదిలే రోజు.
      అత్యంత మహమాన్వితమైన మాఘమాసం నెలరోజులూ క్రమం తప్పకుండా స్నానదానాదులను నిర్వహించడం వల్ల సకల పాపాలు, సర్వ రోగాలు, దరిద్రాలు నశించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అన్నిటా జయం లభిస్తుంది. మాఘమాసంలో శ్రీమహావిష్ణువుతో పాటు పరమశివుడికి అభిషేకంచేసి, అర్చించి శివాలయంలో ప్రదోషకాలంలో దీపారాధన చేస్తే దీర్ఘాయుష్షుతో పాటు సుఖశాంతులు వర్ధిల్లుతాయి.
      కాబట్టి ప్రతివారూ మాసంలో ఆయా కార్యక్రమాలు నిర్వహించి పరమేశ్వరుని కరుణా కటాక్షాలు పొందేందుకు ప్రయత్నిద్దాం.
    వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ



Thursday, 18 February 2016

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

జననం – 19.02.1627 (వైశాఖ, శుక్ల పక్ష తదియ).      మరణం – 04.04.1680 (చైత్ర పౌర్ణమి).
   శివాజీ క్రీ.. ఫిబ్రవరి 19, 1627 సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. జిజాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై (పార్వతి) పేరు శివాజీకు పెట్టింది. మరాఠాయోధుడు ఛత్రపతి శివాజీ మొగల్ చక్రవర్తులకు దక్కన్ సుల్తాన్లకు మధ్య ఏర్పడిన శక్తివంతమైన సామ్రాజ్యం మహారాష్ర్ట సామ్రాజ్యం. సామ్రాజ్య స్థాపకుడిగా శివాజీని చెప్పుకోవచ్చు. శివాజీ తండ్రి షాహాజీ, ఇతడు సుల్తానుల దగ్గర సైన్యాధికారి. తల్లి జిజియాబాయి. దంపతులకు 1630, ఫిబ్రవరి 19 జున్నార్ సమీపంలోని శివనెరీ కోటలో శివాజీ జన్మించాడు. జిజియాబాయి తాను పూజించే దేవత శివై (పార్వతి)పేరు శివాజీకి పెట్టింది.జిజియాబాయి కొడుకుకి చిన్ననాటి నుంచి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలను ఉగ్గుపట్టింది. తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా వ్యూహాలు పన్నాడు. 17 ఏళ్ల వయస్సులో శివాజీ మొట్టమొదటిగా యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. శివాజీ బీజాపూర్ సుల్తాన్ నుంచి పురంధర్. రాయఘడ్, సింహఘడ్ వంటి అనేక కోటలను స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత శివాజీ 1664లో సూరజ్ను ముట్టడించాడు. కానీ 1665లో ఔరంగజేబు పంపిన జైసింగ్ పూనాపై దాడి చేసి పురంధర్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. దీనితో శివాజీ పురంధర్ సంధి కుదుర్చుకున్నాడు. శివాజీ అధీనంలో ఉన్న 35 కోటల్లో 23 కోటలను మొఘలు వశం చేశాడు. తర్వాత నాలుగు ఏళ్లకే వాటిని స్వాధీనం చేసుకున్నాడు. క్రీ.1674లో శివాజీ పట్టాభిషేకం చేసుకున్నాడు. శివాజీ పాలన సుదీర్ 12:27 PM కాషాయవర్ణ సింహాల సమూహంశివాజీ పాలన సుదీర్ఘ కాలం యుద్ధాలతో సాగినా ఎప్పుడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో పట్టుబడిన ఖైదీలు, పిల్లలు, స్ర్తీలకు సహాయం చేశాడు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాడు. ఒకసారి సైనిక అధికారి చిన్నముస్లిం రాజును ఓడించి ఆయన కోడల్ని శివాజీ ముందు బందీగా ప్రవేశపెట్టాడు. అప్పుడు శివాజీ ‘‘నా తల్లి నీ అంత అందమైనది అయితే నేను ఇంకా అందంగా పుట్టేవాడినిఅని, ఆమెను తల్లిగా గౌరవించి కానుకలు పంపిం చాడు .శివాజీ భవానిదేవి భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు.
   కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములు. ఎందరో ముస్లిములు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికి , ఇబ్రహీం ఖాన్ నావికాదళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్, సిద్ధిక్ అనే ఇద్దరు ముస్లింలు!శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, అగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి మదానీ మెహ్తర్ కూడా ముస్లిమే! అలాంటి మచ్చలేని వ్యక్తిత్వం శివాజీది..
శివాజీ మహారాజ్ కీ జై.
వల్లూరి పవన్ కుమార్  

-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ

Wednesday, 17 February 2016

బీష్మ ఏకాదశి

http://www.vipravanam.com/
     కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి, తన ఇష్టానుసారం కురు పితామహుడు భీష్మాచార్యుడు గతించిన రోజు భీష్మ ఏకాదశి. తిథి నక్షత్రాలను, వార వర్జ్యాలను పాటించేవారు ఏకాదశిని మంచిరోజుగా భావిస్తుంటారు. భీష్మ ఏకాదశిని మరింత పవిత్రమైన రోజుగా భావిస్తారు. భీష్మ ఏకాదశికి సంబంధించి పురాణాల్లో కథ ఉంది.
   భీష్ముడి గురించి తెలియని వారుండరు. మహాభారతంలో  భీష్ముడిది చాలా గొప్ప పాత్ర. మహాభారత గాథకు మూల స్తంభమైన భీష్ముడు పుట్టగానే గంగాదేవి వెళ్ళిపోతుంది. ఇతని మొదటి పేరు దేవపుత్రుడు. శంతనుడు దాసరాజు కుమార్తె సత్యవతిని ఇష్టపడతాడు. ఆమెతో తండ్రి వివాహం కోసం దేవపుత్రుడు రాజ్యాన్ని వదులుకుని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటినుంచి గాంగేయుడుభీష్ముడుఅయ్యాడు.
సత్యవతితో తన వివాహం కోసం సామ్రాజ్యాన్ని వైవాహిక జీవితాన్ని కుమారుడు భీష్ముడు త్యాగం చెయ్యడంతో శంతనుడు బాధపడతాడు. ఇంత త్యాగం చేసిన కుమారునికి స్వచ్చంద మరణాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అనంతరం పాండవులు, కౌరవులకు కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరుగుతుంది. యుద్దంలో పదిరోజులు తీవ్రంగా యుద్ధం చేసిన భీష్ముడు అర్జునుని ధనుర్భాణానికి నేలకొరిగి శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయిస్తాడు. దీన్ని తలపునకు తెచ్చేది ఏకాదశి వ్రతం.
    కార్తీక శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయించిన భీష్ముడు మాఘశుద్ధ అష్టమి నాడు మరణించినట్టుగా పలు పురాణ గ్రంథాల్లో పేర్కొన్నారు. ఉత్తరాయణం మాఘశుద్ధ అష్టమి రోజు ప్రవేశించినట్టుగా ప్రమాణాలు ఉన్నాయి. నిర్ణయ సింధువులలోనూ, భీష్మ సింధువులలోనూ, ధర్మ సింధువులలోనూ మాఘ శుద్ధ అష్టమినాడు భీష్మునికి తిలాంజలి విడిచి పూజించాలని ఉంది.
       భీష్మాష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధ కర్మలు చేసినవారికి సంతానాభివృద్ధి జరుగుతుందని, పుణ్యం ప్రాప్తిస్తుందని పలువురు అంటున్నారు. కారణంగా భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి పుణ్యదినాలయ్యాయి. పలు పర్వదినాలున్నా అన్నింటినీ అందరూ చేసుకోన్నట్లే భీష్మ ఏకాదశిని కూడా బ్రాహ్మణ, క్షత్రియులే పాటిస్తూ వస్తున్నారు. సంతాన భాగ్యానికి దూరమై మరణించిన భీష్మునికి వారసులమని క్షత్రియులంతా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భీష్మునికి తర్పణం వదలటం ఆనవాయితీ. అయితే భీష్ముడు మరణించిన రోజున బ్రాహ్మణులు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశినాడు ఉపవాస దీక్ష విరమిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో క్షత్రియులు భీష్మ ఏకాదశి రోజున పండితులను పిలిపించుకుని భీష్ముని జన్మ వృత్తాంతాన్నంతా చెప్పించుకుంటున్నారు. సంతాన ప్రాప్తిని కోరే చాలామంది బ్రాహ్మణ, క్షత్రియేతరులు కూడా భీష్మ ఏకాదశిని పాటిస్తున్నారు.
    వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ

శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి

http://www.vipravanam.com/
     అధునాతన సమాజంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టి, హేతువాదిగా ఉన్న నరేంద్రుని దృష్టికోణం మార్చి వివేకానందునిగా అందించిన మహాప్రవక్త, పరమరుషి రామకృష్ణపరమహంస. ఆధ్యాత్మ చింతనకే జీవితాన్ని అంకితం చేసిన వాడు, కాళిమాత చరణారవింద సంసే వనా భాగ్యోపేతుడు రామకృష్ణ. ఆలిలోనూ అమ్మను చూడగలిగిన పరమభక్తి పరిపూర్ణుడు రామకృష్ణ.
     1836 ఫిబ్రవరి18 పశ్చిమబెంగాల్లోని హుగ్లీజిల్లా కామార్పుకూర్లో జన్మించాడని, కొస్సీపూర్వనాంతర గృహంలో 1886 ఆగస్టు16 50 యేట శరీరత్యాగం చేశాడని అనుకోవడమే తప్ప అంతటి మహనీయుడికి జననమరణాలుంటాయా? జనన మరణాలు, ప్రపంచయాత్రలు పాంచభౌతిక శరీరానికే తప్ప అటువంటి దివ్యాత్మకుల కుంటాయా? 19 శతాబ్దంలో పశ్చిమబెంగాల్లో జరిగిన సాంస్కృతిక పునరుజ్జీవనం పైనే కాదు యావత్ప్రపంచం పైనా తన ప్రభావాన్ని బలంగా వేసిన రామకృష్ణ పరమహంస కన్నా గొప్ప సర్వమత సమతా వాది మరొకడు కానరాడు. పార లౌకికచింతనలో నిత్యం తన్మయమై ఉన్నా ఆయన బోధనలలో లౌకికవాద సారం తొణికిసలాడుతుంటుంది. ఆయన భావనలు నిత్యాలు-వాక్కులు సార్వకాలిక సత్యాలు.
     తండ్రి క్షుదీరామ్‌, తల్లి చంద్రమణి అని చెప్పుకోవ డమే తప్ప శరీర వ్యామోహమే లెనివానికి గదాధర్ఛటోపాధ్యాయ నామకరణం చేసినా అది నిలుస్తుందా? ధార్మిక ప్రపంచం దాన్ని తలుస్తుందా? అలౌకిక జీవనం గడిపేందుకువచ్చిన రామకృష్ణునికి బడిచదువులు వంట పట్టలేదు. వడుగుచేసుకుంటే ప్రథమ భిక్షను ఒక శూద్ర యువతి నుంచి అందుకుని సంచలనంరేపిన సంఘ సంస్కర్త. హిందూమతం లోతులు తెలుసుకునేందుకు ఇతర మతాలనూ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన విశాల హృదయుడు రామకృష్ణపరమహంస. తెలుసుకునే కొద్దీ తెలుస్తుంది మనకు తెలియనిదేమిటో అన్న నానుడిని నిజం చేసిన వాడు, అందరికీ అన్ని మతాల హృదయం అందేలా అనుగ్రహభాషణలు చేసినవాడు రామకృష్ణ పరమహంస. ధార్మిక గురువులు తోతాపురి నుంచి నిర్వి కల్పసమాధిస్థితిని, భైరవి బ్రాహ్మణినుంచి భక్తిభావంలో భగవత్సాక్షాత్కారం పొందే విధానాన్ని గ్రహించినా ఆయనలోని ధార్మిక దాహం అంతటితో చల్లారలేదు. క్రైస్తవం, ఇస్లాం మతాల సారాన్ని మనసునిండా గ్రోలే వరకు ఆయన శోధన ఆగలేదు. కామార్కపూర్లో పుట్టినా కామాది విరహితమైన ఆత్మస్థితి పట్టువడింది. అయిదేళ్ళ వయసులోనే రామకృష్ణుని జీవితభాగస్వామి గా వచ్చిన శారదను బాలాత్రిపురసుందరి అవతారంగా భావించి ఆరాధించి ఆలిహోదా నుంచి అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళాడు. అందుకే వారి వైవాహిక జీవితంలో శరీరాపేక్ష ప్రసక్తే ఉత్పన్నం కాలేదు. వారి కాపురం రెండు మనసుల సహవాసంగా సాగిందే తప్ప రెండు శరీరాల సహజీవనంగా సాగలేదు.
     భారతదేశానికి ఒక ఆకారమిచ్చి దేశమాతను అమ్మ వారితో సమానమని వర్ణించిన ఘనత రామకృష్ణులకే దక్కుతుంది. జాతీయోద్యమంలో భారతమాత బ్రిటిష్వారి ఉక్కుపాదాలకింద నలిగిపోతోంది, పరాయిమూక లకు దాస్యం చేస్తోందన్న ఆలోచన తరం వారిని ఉడికించింది. రక్తం మరిగించింది. రామకృష్ణ పరమ హంస బోధనల్లో సామాజికాంశలు, మానవతా విలువలు, సంఘసంస్కరణ ధోరణులుంటాయి. కనుకనే ఆయన సన్యాసాశ్రమం స్వీకరించిన అధ్యాత్మ యోగి అయినా ఆయనపై కులం, మతం ప్రభావం మాత్రం పడలేదు.
     శరీర విసర్జనకు ఏదో ఒక కారణం కావాలి కనుక క్యాన్సర్ఒక కారణంగా ఆయన శరీరంలోకి ప్రవేశిం చింది. 1885 డిసెంబర్‌ 11 రామకృష్ణునికి తీవ్రమైన గొంతునొప్పి వచ్చింది. అదే క్రమంగా క్యాన్సర్గా బైట పడింది. ఆయనకు చికిత్స చేసేందుకు శ్యాంపుకూర్లో పెద్దపెద్ద వైద్యులంతా ప్రయత్నించి విఫలమయ్యారు. 1885 డిసెంబర్‌11 ఆయనను కాసిపూర్కు వైద్యాల యానికి మార్చారు. శిష్యులు, ఆయన సతీమణి శారదా దేవి సపర్యలు చేశారు.
గొంతు క్యాన్సర్ముదిరి రామ కృష్ణులు విపరీతంగా బాధపడు తుండేవారు. ఎట్టిపరిస్థితి లోనూ ఎవ్వరితో మట్లాడ వద్దని వైద్యులు సలహా ఇచ్చారు. అయినా రామ కృష్ణులు మాట్లాడ్డం మానలేదు. తన వద్దకు వచ్చిన వారికి హితవు చెప్పకుండా ఉండనూ లేదు. ఆఖరిరోజులు సమీపించిన సమయంలో వివేకానందుని పిలిచి తన ఆధ్యాత్మశక్తిని ఆయనలో నిక్షిప్తంచేశారు. తన తరువాత వివేకానందుడు తన ఆలోచనా సంవిధానాన్ని కొనసాగిస్తాడని, అంతా ఆయనకు సహకరించాలని కోరారు. శిష్యులను జాగ్రత్తగా చూడాలని, తన బోధనలను భవిష్యత్తు లోనూ వారికి వినిపిస్తూ నిరంతరచైతన్యమూర్తులుగా వారిని తీర్చిదిద్దాలని కోరారు. కాశీపూర్తోట గృహంలో వివేకా నందకు అధికార పగ్గాలు అప్పగించి 1886 ఆగస్ట్‌ 16 తెల్లవారుఝూమున బ్రహ్మైక్యం చెందారు. రామ కృష్ణులు మహాసమాధిలోకి వెళ్లారని ఆయన శిష్యులు విశ్వసిస్తారు.
     ఆగస్ట్‌ 16 దివ్యసమాధి చెందిన రామకృష్ణ పరమ హంసకు వివేకానందుడుకాక 16 మంది శిష్యులు ఉండే వారు. గంగానది ఒడ్డున గల బారానగర్లో సగంసగం కూలిన పాతకాలపు ఇంట్లో రామకృష్ణుని వారసునిగా వివేకానంద తన కార్యకలాపాలు ప్రారంభించాడు. ఆయనకు ఇంటాయన, మరికొందరు శిష్యులు ఆర్థిక సాయం అందించారు. రామకృష్ణుని పేరిట తొలి ఆశ్రమం ఇదే! తరువాత రామకృష్ణుల విచారధార విశ్వవ్యాప్తమయ్యే కొద్దీ శాఖోపశాఖలుగా విస్తరించింది. నిస్వార్థ సేవకు, నిరంతర నైతిక విలువల ప్రబోధలకు రామకృష్ణుని ఆశ్రమాలు పెట్టింది పేరు. రామకృష్ణుని బోధనలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు రామకృష్ణ మిషన్‌, రామకృష్ణులు ప్రారంభించిన సన్యాసి జీవన విధానాన్ని కొనసాగించేందుకు రామకృష్ణమఠం ప్రారంభించాడు. రామకృష్ణుల పేరుతో సంస్థలుస్థాపించి వివేకానందుడు తన నిస్వార్థబుద్ధిని చాటుకున్నాడు. వివేకానందుడు రామకృష్ణుని ఆత్మపుత్రునిగా, ధార్మిక జీవనానికి వారసుడిగా మిగిలి తిరుగులేని, ఎవ్వరూ తిరగరాయలేని చరిత్ర సృష్టించాడు. పరమ తత్వ వేత్తగా, మహామహోపాధ్యాయునిగా ప్రపంచ ప్రజల నీరాజనాలందుకున్నాడు. అన్ని మతాల సారం ఒక్కటే. మానవసేవే మాధవసేవ.. భగవంతుని చేరేందుకు భిన్న మతాలు విభిన్న మార్గాలు అంటూ ఆయన చేసిన బోధనలు చిరస్మరణీయాలు...అందరికీ ఆచరణీయాలు.
    వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ