గురు పౌర్ణమి
గురుర్ర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్పరబ్రహ్మ
తస్మై శ్రీ గురువే నమః
అనాది కాలంనించీ "ఆషాడ శుద్ధ పౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు. మరియు దీనినే "వ్యాసపౌర్ణమి"
గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం
నలుమూలలా గురుపూజా మహాత్సవాలు నిర్వహిస్తూ ఉంటరు. ఆ రోజు ముని
శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కావున ఆ భగవానుని
యొక్క జన్మదినం మానవ చరిత్రలొనే అది
ఒక అపూర్వమైన ఆధ్యత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతుంది. అసలు ఈ ఆసాఢ
శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత ఏమిటో
...? ముందు తెలుసుకుందాం. దీనికి ఒక చక్కని ప్రాచీన
గాధకలదు. పూర్వం "వారణాశి" లో కదుపేద బ్రాహ్మణ
దంపతులు ఉండేవారట! ఆత్రేయసగోత్రము గల ఆ బ్రహ్మణుని
యొక్క పేరు 'వేదనిధీ. వాని
యొక్క భార్య వేదవతీ. ఇరు
ఇరువురు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి
జీవించుచుండేవారు. వారు సంతానము భాగ్యము
కరకై ఎన్ని నోములు నోచినా,
ఎన్ని వ్రతాలు చేసినా; వారికి మాత్రం సంతానము కలుగలేదు. ఇలా ఉండగా; ఒకనాదు
'వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వార్త
తెలుసుకుంటాడు. ఎలా అయినాసరే! వ్యాసమహర్షి
దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతక నారంభిస్తాదు, ఒకరోజునదీతీరాన
ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన
వ్యక్తిని దర్సిస్తాడు. వెనువెంటనే "వేదనిధి" వాని పాదాలను ఆశ్రయిస్తాడు.దానికి ఆ భిక్షువు చీదరించుకుని
కసరికొడతాడు. అయినా సరే! పట్టిన
పాదాలను మాత్రము విడువకుండా "మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని"
నేను గ్రహించాను. అందుచేతనే, మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాదు.
ఆ మాటలు విన్న ఆ
అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూత్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని
ఆప్యాంగా చేరదీసీ, నాయొక్క రహస్యం మాత్రము ఎవరికి తెలియకూడదు. ఇంతకీ నీకు ఏమికావాలొ
కోరుకో అంటాడు. మహానుభావా! రేపు నా తండ్రిగారి
పితృకార్యము. దానికి తమరు బ్రహ్మణార్థమై భోజనానికి
మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా
కోరిక! అనిబదులు చేప్తాడు. అందులకు ఆ మహర్షి అతని
ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.
అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న 'వేదనిధి' తన భార్యామణికి గంగానదీతీరాన
జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం
వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని!
ఆ దంపతులులతో వారిని పూజిస్తారు. అనంతరం వారి దేవతార్చనకు 'సాలగ్రామమూ,
'తులసీ దళాలు, పూలు మున్నగు పూజాద్రవ్యాలు
సిద్ధం చేస్తారు. వారి పూజా అనంతరం
ఎంతో శుచిగా మడిగా సర్వవంటకాలను సిద్ధపరచి
శ్రద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు.
అనంతరం ఆ దంపతులు ఆ
వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు.
వారి అతిథ్యాని ఎంటో సంతుష్టులైన ఆ
ముని శ్రేష్ఠుడు. ఓ పుణ్య దంపతులారా1
మీకు ఎమి వరకావాలో కోరుకోండి.
నోమూలూ లేవు. చేయని వ్రతాలు
లేవు అయినా! సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు! అని
బదులు పలుకుతారు. ఓ అదర్శ దంపతులారా!
అందులకు మీరు చింతించవలసిన పనిలేదు.
త్వరలోమే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు
అయిన పదిమంది పుత్రసంతతికలిగి, మీరు చక్కని సుఖజీవనముతో
జీవితంలో ఎన్నో సుఖభోగాలాను అనుభవిస్తూ;
అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలరు, అని అశీర్వదించి తిరుగు
ప్రయాణమవుతున్న వ్యాసభగవానునితో ప్రభూ! తిరిగి తమదర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది?
అని 'వేదనిధీ ప్రశ్నిస్తాడు. అందులకు వ్యాస మహర్షి అంటారు.....!....!....!
"శృణు విప్రతవేచ్చా చేత్ దర్శనార్థం తదాత్వయా
పూఅజనీయో విశేషేణ, కథావాచయితా స్వయం"
అని అంటే, ఓ భూసురోత్తమా!
నన్ను మరల మరల దర్శించుచు
ఉండాలని మీరు ఎంతో కోరికతో
ఉన్నారని నేను గ్రహించుచున్నాను. అందువలకు
నన్ను మీరు ఎలాదర్శించగలరో చేప్తాను,
వినండి. ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! మన వేద
వేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసములయొక్క
గూడార్థాలు ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో! అతడే నా యొక్క
నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైనా
ఆతన్ని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికులందరిలోను నేను
ఎల్లప్పుడూ ఉంటాను. అని! ఆ శ్లోకభావము.
అంతియేకాదు ఎవరైనాసరే! గతకల్పాలలో జరిగిన చరిత్ర; విస్వం యొక్క పూర్వవృత్తాంతం; పూరాణగాథలు
మున్నగునవి విప్పి చెప్పాలంటే! వార్మి వ్యాస భగవానుని అనుగ్రహము
లేనిదే చేప్పలేరు. కావున అట్టి పౌరాణికుణ్ణి
ఎంచి ఆషాఢ శుద్దపాద్యమి"నాడు
వార్కి "గురుపూజ" చేసి పూజించవలెనని చెప్పారు.
నాటినుండి నేటివరకు ఆచారము కొనసాగుచునే ఉన్నద అని మనము
గమనిస్తున్నాము గదా!'-మరి. అది
విన్న 'వేదనిధీ మరోమారు వ్యాసభవానుని ప్రశిస్తాడు. మహాత్మాతమను ఏయే రోజుల్లో ఎవిధంగా
పూజించాలి? సవిస్తరంగా చెప్పవలసింది అంటాడు.
"మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః
ఆషాధ శుక్ల పక్సేతు పూర్ణిమాయాం
గురౌతథా
పూజనీయే విశేషణ వస్త్రాభరణ ధేనుభిః
దక్షిణాభిః మత్స్యరూప ప్రపూజయేత్
ఏపం కృతే త్వయా విప్రః
మత్స్య రూపస్య దర్శనం
భవిష్యతి నసందేహొమ యైవోక్తం ద్విజోత్తమ."
ఓ బ్రహ్మణోత్తమా! నేను జన్మించిన ఆషాధశుద్ధ
పౌర్ణమినాడు ఈ గురుపూజను ఆరోజు
శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు కనుకాగురువారమూ
అయిన ఎడలాది మరింతగా స్రేష్ఠమైనది. వస్త్ర, అభరణ గోదానములతో అర్ఘ్య
పాదాలతోటి నా రూపాన్ని పూజించువార్కినా
స్వరూప సాక్షాత్కారం వార్కి లభిస్తుంది; అని సాక్షాత్తు వ్యాస
పౌర్ణమి, నేటికినీ, సర్వులకు అత్యంత పుణ్య ప్రదముగా చెప్పబడుచున్నది.
ఈ గాథ పూర్వము నారదుడు
వైశంపాయనుడికి "ఈ గురు పౌర్నమి
యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ "స్వధర్మసింధూ" అనే గ్రంధములోను వివంగా
చెప్పబడి యున్నది. దీనిని బట్టి వ్యాసులవారి యొక్క
జన్మ ఆషాఢ శుద్ధపాడ్యమి అని
విదితమవుచున్నది.
వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః
అట్టి పరమ పవిత్రమైన "గురుపౌర్ణమి"
పుణ్యదినం మనంతా విశేషంగా జరుపుకుని
ముందు తరాలవార్కి మార్గదర్శకుల మౌతూ, పునీతులౌదాము.
వల్లూరి పవన్ కుమార్
-బ్రాహ్మణ సంఘం గ్రేటర్
వరంగల్ శాఖ