సరస్వతీ పూజ
నరుడు నారాయణుడుగా ఎదగడానికి, మానవుడు మాధవుడుగా మారడానికి మహాసరస్వతీ ఉపాసన ఒక్కటే మార్గం.
అందుకే ఈ శరన్నవరాత్రులల్లో సప్తమి
మూలా నక్షత్రం రోజున ఆరాధింపబడే ‘దుర్గ’
యొక్క మహాకాళీ, మహా లక్ష్మీ, మహా
సరస్వతీ రూపాల్లో మహా సరస్వతీ రూపాన్ని
‘శారద’ గా భావించి ఆరాధిస్తాం.
మూలానక్షత్రం ధనూరాశిలో ఉంటుంది. ఆ రాశికి అధిపతి
గురుడు. గురుడు విద్యాకారకుడు, ధన కుటుంబకారకుడు. మూలానక్షత్రానికి
అధిపతి కేతువు. కేతువు ఊర్థ్వముఖుడు. సంఖ్యామాన శాస్త్రం ప్రకారం, ఏడు అంకె కేతువుకు
చిహ్నం. నవరాత్రి ఉత్సవములలో ప్రధానమైనది- సప్తమి తిథిపూజ, ఆ సరస్వతీ దేవిని
గూర్చి బ్రహ్మవైవర్త పురాణం రాధదేవి నాలుక కొననుంచి శే్వతవస్త్ధ్రారిణి,
పుస్తకాన్ని, వీణను చేతిన పట్టుకొని,
సర్వాలంకార భూషితయై ఉద్భవించిన దేవియే మహాసరస్వతీ దేవి అంది. ఆ
తల్లినే శారద.
తెల్లని
హంసవాహనంలో పద్మాసనస్థితయై, శే్వతాంబరధారియై, వీణాపాణియై అలరారే ఈ తల్లి పుస్తక,
అభయ, స్ఫటికమాల ధరించిన చతుర్భుజ. విద్యామణి. మనిషిలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతి. ఆ పరమేశ్వరి బుద్ధి
ప్రదాత, సర్వసిద్ధి దాత కనుక ప్రతివారు
జ్ఞాన విద్యా బుద్ధులకై ‘‘వందే తాం పరమేశ్వరీం
భగవతీం, బుద్ధి ప్రదాం శారదామ్’’ అంటూ ప్రార్థిస్తారు. ఈ
తల్లి అనుగ్రహం ఉంటే చాలు సర్వవిద్యలూ
కరతలామలకం అవుతాయ కనుక ‘అ’కారాది
‘క్ష’కారాంత వర్ణములతో వచ్చే గద్య పద్య
వచన రూపాలల్లో ఏ దేవత కొలువైవుందో
ఆ దేవతనే సరస్వతి అని ఆదిశంకరాచార్యులూ స్తుతించారు.
యాజ్ఞవల్క్యుడు, వశిష్ఠుడు వాణీస్తోత్రం, వశిష్ఠ స్తోత్రాల్లో ఈ తల్లి ని
ఏవిధంగా పూజించాలో వివరించారు.
సరస్వతీ
దేవియే శారదయై సర్వవిద్యలనూ ఎలా ప్రసాదించి మానవులను
ఎలా పవిత్రులను చేస్తుందో అదేవిధంగా అన్నపూర్ణయై అన్నంపెడుతుంది. ఈతల్లే జ్ఞానం చేత భవసాగరాన్ని దాటిస్తుంది.
సకలబుద్ధులను ప్రకాశింపచేసే దేవతే సరస్వతి అని
యజుర్వేదం కూడా చెప్తోంది.
సరస్వతీ
దేవిని పూజించిన వారికి ధన ధాన్యాలనుప్రసాదిస్తుంది కనుక ఈ
తల్లిని వాజే భిర్వాజినీవతీ ధీనా
మవిత్య్రవతు అని ఋగ్వేదం అంటోంది.
ఈ సరస్వతీరూపంలో ఉన్న తల్లిని ఆవాహనాది
షోడశోపచారాలతో పూజించాలి. కాని, సర్వదేవతారాధనకు మల్లే
ఈ తల్లిని ఉద్వాసన చేయనక్కర ల్లేదు. ఆ తల్లి సర్వవేళలా
సర్వావవస్థలయందూ మనదగ్గరే ఉండాలని ప్రతివారు కోరుకుంటారు. ఈ తల్లి చింతామణి
సరస్వతి, జ్ఞాన సరస్వతి, నీల
సరస్వతి, ఘట సరస్వతి, కిణి
సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మహాసరస్వతి అనే ఏడు రూపాలలో
ఉంటుందని మేరు తంత్రంలో ప్రస్తావించారు.
త్రిశక్తుల్లో ఒకటైన మహాసరస్వతిదేవి శుంభ
నిశుంభులనే రాక్షసుల్ని వధించింది. దీనికి నిదర్శనంగా అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం చేస్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజున
చేసే సరస్వతి అలంకారం విశేష ప్రాధాన్యతను సంతరించు
కొంటుంది. ప్రతిరోజూ ‘‘వాగ్దేవి వసుధా తీవ్రా మహాభద్రా
మహాబలా భోగదా భారతీ భామా
గోవిందా గోమతీ శివా అంటూ
సరస్వతి దేవి అని పూజిస్తే
సర్వకార్యాలు అనుకూలం అవుతాయ.
వల్లూరి పవన్
కుమార్
- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment