వాల్మీకి జయంతి - ఆస్వయుజ పూర్ణిమ
మహా పుణ్య కవి , రామాయణాన్ని
అందించిన వాల్మీకి మహర్షి కారణజన్ముడు . వాల్మీకి జీవితం ఎంతో విలక్షణమైనదని, వాల్మీకి
తన జీవిత కాలంలో పాపా,
పుణ్య కర్మలను ప్రక్షాళన చేశాడు , తన రామాయణ ఇతిహాసం.
మానవుడు రచించిన తొలి గ్రంథము , చారిత్రక
పురుషుడైన రఘురాముని గురించి ఇతని సమకాలం గురించి
చెప్పడమే కాకుండా కథనం మధ్యమంగా ఆనాటి
భౌగోళిక విషయాలను క్రోడీకరించాడు. సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కధ. దీనిని "సీతాయాశ్చరితం
మహత్" అని వాల్మీకి అన్నాడు.
24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము,
హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర
చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు,
ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో
రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.
రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు)గా విభజింప బడినది.
వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కధకు ప్రధానమైన ఆధారం.
ఇంతే గాక విష్ణుపురాణములో రాముడు
విష్ణువు యొక్క ఏడవ అవతారము
అని చెప్పారు. భాగవతం నవమ స్కంధములో 10, 11 అధ్యాయాలలో
రాముని కధ సంగ్రహంగా ఉంది.
మహాభారతంలో రాముని గురించిన అనేక గాధలున్నాయి. వాల్మీకి
సంస్కృతంలో ఆదికవి. రామాయణాన్ని వ్రాశాడు. వల్మీకం అనగా పుట్ట అని
అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు
కాబట్టి వాల్మీకి అయ్యాడు.
చరిత్ర :
త్రేతాయుగములో గంగానదీ తీరములో నైమికారణ్యములో అనేకమంది మునులు ఆశ్రమములు నిర్మించుకొని నియమ నిష్టలతో తపస్సు
చేస్తూ ఉండేవారు. మునీశ్వరులందరూ బ్రాహ్మణ కుటుంబాలకు చెందివారే. అందులో ఒక ముని పేరు
ప్రచస్థాముని .. .. ఇతనికి ఒకకుమారుడు ... పేరు " రత్నాకరుడు " ఒకరోజూ
రత్నాకరుడు ఆడుకుంటూ అడవిలో దారితప్పి ఎటుపోవాలో తెలియ భయము ఏడుస్తూ
ఉన్న సమయాన ఆ దారినిపోయిన
ఒక వేటగాడు ... ఈ పిల్లవాడిని ఓదార్చి
తనవెంట తన నివశిస్తున్న గుడెసె
తీసుకు పోయి , తనకు పిల్లలు లేనందున
తన కొడుకుగా పెంచుకోసాగెను. ప్రచస్ఠా ముని తన భార్యతోకూడి
కుమారుని కొరకు వెదికి దొరక
పోయేసరికి , ఏ క్రూరజంతువు తినిఉంటుందని
భావించి పుత్రశోఖం తో వెనుదిరిగి తమ
ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఇక్కడ
బోయకుటుంబానికి చెందిన వేటగాడు , అతని భార్య తమ
సొంత కొడుకు గానే రత్నాకరుడు ని
పెంచి పెద్దచేసారు. విలువి్ద్యలో మంచి ప్రావీణ్యము , వేట
లో నైపుణ్యము సంపాదించిన రత్నాకరుడు మంచి తెలివైనవాడు . తన
వేట నైపుణ్యము తో ఆ అడవి
లోని పక్షులకు , జంతువులకు యముడుగా తయారయ్యాడు . యవ్వనము వచ్చిన రత్నాకరునికి బోయ తల్లిదండ్రులు
వారి వంశములోని అమ్మాయిని చూసి పెళ్ళిచేసారు. కొంతకాలానికి
ముగ్గురు పిల్లతో రత్నాకరుడి కుటుంబము పెద్దది కావడము వలన తన సంపాదన
పెంచుకొనేనిమిత్తము దారిదోపిడి
, దొంగతనము లను వృత్తిగా తీసుకొని
అవసరమైన చోట బాటసారులను చంపి
ధనాన్నిదోచుకుని తన కుటుంబము హాయిగా
బ్రతికేందుకు పాటుపడేవాడు .
ఒకరోజు అడవి దారిలో ఒకచోట
కూర్చోని బాటసారులకోసము పొంచి ఉన్న సమయాన
ఆ దారిన " నారద మహర్శి " రావడము
జరిగింది. నారద ముని సర్వసాదారణ
మానవరూపలో ఉన్నందున రత్నాకరుడు దోచుకునే ప్రయత్నము చేయగా ... తన దగ్గర వీణా
, రుద్రాక్షలు , కాషాయ వస్త్రాలు తప్ప
ఏమీ లేవని తెలిపినా ... వినక
చంపివేయదును అని భయపెట్టసాగెను. అప్పుడు
ఓ బోయవాడా ... దొంగతనము , దోపిడీలు, ఇతరులను హించించి హత్యచేయడము పాపము అని హితబోద
పలికినా నమ్మలేదు . " నీవు ఇన్ని పాపకార్యములు
ఎవరికోసము చేయుచున్నావని అడుగగా" ... తన కుటుంబపోషనకొరకై తెలిసిన
విద్య ఇది ఒక్కటే ... పాప
పుణ్యాలు నాకు తెలియవు . అప్పుడు
నారదముని ఆ బోయవానికి జ్ఞానోదయము
కలిగించే ఉపాయము ఆలోచించి .. " ఓ బోయవాడా నీవు
చేయు ఈ పాపాలు నీ
కుటుంబ సబ్యులు ఎవరైనా పంచుకుంటారేమో అడిగి తెలుగుకోమని తనతో
నారదముని ఆ బోయ ఇంటికివెళ్ళి
.. పాపాలు పంచుకుంటారేమో అడుగగా తల్లి దండ్రులు గాని
, భార్యా బిడ్డలు గాని అందుకు సమ్మతించగపోగా
... కుటుంబపోషణ ఇంటి యజమాని బాధ్యత
అని పాపమో , పుణ్యమో అది తనవరకే గాని
, తీసుకున్నా వీలు పడదని , పాప
పుణ్యాలు ఒకరినుంది ఇంకొరికి ఇవ్వనూలేము , తీసుకోనూలేము అని వారి నిస్సహాయతను
తెలియజేసిరి.
ఆ మాటలు విన్న రత్నాకరుడు
పశ్చ్యాత్తాపము చెంది , పాపవిముక్తికై ఉపాయము చెప్పమని నారదుని వేడుకొనెను . అప్పుడు నారదుడు తన నిజ రూపాన్ని
బోయవానికి చూపించి భక్తి మార్గానికి " మరా
మరా " అనే రెండక్షరాల మంత్రాన్ని
బోధించెను . అప్పటినుంది నైమికారణ్యము లో రామ రామ
రామ మంత్రము తో కొన్ని సంవత్సరాలు
తపస్సు చేయగా తనచుట్టూ మట్టి
పుట్టలా కప్పివేయడము జరిగింది. బయట తిరిగే బాటసారులెవరికీ
తను కనబడడము
జరుగలేదు. నారద మహర్షి తనకున్న
దేవతా శక్తులతో రత్నాకరుని కుటుంబానికి ధన , ధాన్య , అశ్వర్యములను
ప్రసాదించెను . నారదమునికి తెలుసు ఈ రత్నాకరుడు కారణజన్ముడని
.. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత నారదముని తిరిగి అదే దారిన కావాలనే
వచ్చి రత్నాకరుడున్న పుట్టను తెరచి , చిక్కి బక్కై , బయటి ప్రపంచముతో సంబంధము
లేని ఆ రత్నాకరుని చెవులో
రామ రామ రామ అని
పలుకగా కళ్ళు తెరచిన ఆ
రత్నాకరుని ఆపాదమస్తం ను తన మృదువైన
చేతులతో తడివి పునీతము గావించెను.
" ఓ రత్నాకరా నీవు గొప్ప తపశ్సాలివి
అయ్యావు . దేవుడు నిన్ను కరుణిచాడు . నీవు మళ్ళీ జన్మించావు
., ఈ పుట్తనుంది పుట్టేవు కావున నీవు ' వాల్మీకి ' గా పిలువబడుతూ లోక
కణ్యానము కోసము మంచి కావ్యాన్ని
వ్రాసెదవు అని " దీవించి అదృశ్యమయ్యెను. నాటినుంది వాల్మీకి ఎంతోమంది శెస్యులతో తన జీవితాన్ని గడుపసాగెను.
వాల్మీకి వలస :
అటవీ తెగకు చెందిన వాల్మీకి
కరువుల వల్ల బ్రతుకు తెరువు
కోసం ఉత్తర భారత దేశం
నుండి వలస బాట పట్టాడు.
ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే
జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం (నల్లమల
అడవులు) గూండా దక్షిణ భారతదేశం,
ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో
వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు
తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని
దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని
కావ్యంలొ పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న
గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య
దశ వచ్చే సరికి తమిళనాడు
రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న
షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో
ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని
శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ.
కూజంతం రామ రామేతి మధురం
మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖాం వందే
వాల్మీకి కోకిలం
వాల్మీకేర్మునిసిమ్హస్య
కవితావనచారిణః
శ్రుణ్వన్ రామ కధానాదం కొనయాతి
పరాం గతిం
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం వరంగల్
అర్బన్ శాఖ
No comments:
Post a Comment