కార్తిక మాసం, కార్తీక పురాణాధ్యాయ పరిచయము
శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే
కార్తీకమాసం నెలరోజులూ పర్వదినాలే. కార్తీకంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానం
చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, తులసికోటముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ దూప దీప నైవేద్యాలను
సమర్పిస్తారు.
ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకిమైన, అనిర్వచనీయమైన
ఆనందం కలుగుతుంది మామూలు రోజులలో భగవదారాధన మీద అంతగా శ్రద్ధ
పెట్టనివారు, గుడిలో కాలు పెట్టనివారిని సైతం
పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకెళ్తుంది. వారిని దేవుని ముందు కైమోడ్చేలా చేసి,
పాపాటు పటాపంచలు చేసి మోక్షప్రాప్తి కలిగిస్తుంది
ఈ మాసం.అందుకే ఇది
ముముక్షువుల మనసెరిగిన మాసం
న కార్తీక సమో మాసో న
శాస్త్రం నిగమాత్పరమ్
నారోగ్య సమముత్సాహం న దేవ: కేశవాత్పర:
కార్తీక మాస మహత్యాన్ని మొదటగా
వశిష్ట మహర్షి జనక మహరాజునకు వివరించగా
శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు.
ఈ మాసంలో ప్రతీరోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిథిన
ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దానిక ప్రకారం ఆచరిస్తే
మరిన్ని ఉన్నత ఫలితాలు కలుగుతాయి.కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నానాదులు కూడా
అత్యంత విశిష్టమైనదే.నదీ స్నానం,ఉపవాసం,
దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు
ఈ మాసంలో అచరించదగ్గ విధులు.కార్తీక మాసంలో శ్రీమహా విష్ణువు చెరువులలో, దిగుడు బావులలో,పిల్లకాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపీ,
కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం.కుదరని
పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం
చేసే నీటిలో గంగ, యమున, గోదావరి,కృష్ణ,కావేరి,నర్మద,
తపతి,సింధు మొదలైన నదులన్నింటి
నీరూ ఉరిందని భావించాలి.
కార్తీక పురాణాధ్యాయ పరిచయము
1 వ అధ్యాయము : కార్తీకమాహత్మ్యము గురించి జనకుడు ప్రశ్నించుట, వశిష్టుడు కార్తీక వ్రతవిదానమును తెలుపుట, కార్తీకస్నాన విదానము.
2 వ అధ్యాయము : సోమవార వ్రత మహిమ, సోమవార
వ్రతమహిమచే కుక్క కైలాసమేగుట.
3 వ అధ్యాయము : కార్తీకస్నాన మహిమ, బ్రహ్మరాక్షసులకు ముక్తి
కలుగుట.
4 వ అధ్యాయము : దీపారాధన మహిమ, శతృజిత్ కథ.
5 వ అధ్యాయము : వనభోజన మహిమ, కిరాతమూషికములు మోక్షము
నొందుట.
6 వ అధ్యాయము : దీపదానవిధి - మాహ్త్మ్యం, లుబ్దవితంతువు స్వర్గమున కేగుట.
7 వ అధ్యాయము : శివకేశవార్చనా విధులు.
8 వ అధ్యాయము : శ్రీహరి నామస్మరణాధన్యోపాయం, అజామీళుని కథ.
9 వ అధ్యాయము : విష్ణు పార్షద, యమదూతల వివాదము.
10 వ అధ్యాయము : అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము.
11 వ అధ్యాయము : మంథరుడు - పురాణమహిమ.
12 వ అధ్యాయము : ద్వాదశీ ప్రశంస, సాలగ్రామదాన్మహిమ.
13 వ అధ్యాయము : కన్యాదానఫలము, సువీరచరిత్రము.
14 వ అధ్యాయము : ఆబోతునకు అచ్చుబోసి వదులుట (వృషోసర్గము), కార్తీకమసములో విసర్జింపవలసినవి, కార్తీక్మాసశివపూజాకల్పము.
15 వ అధ్యాయము : దీపప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతిలో
నరరూపమొందుట.
16 వ అధ్యాయము : స్తంభదీప ప్రశంస, దీపస్తంభము విప్రుడగుట.
17 వ అధ్యాయము : అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము.
18 వ అధ్యాయము : సత్కర్మానుష్ఠానఫల ప్రభావము.
19 వ అధ్యాయము : చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణము.
20 వ అధ్యాయము : పురంజయుడు దురాచారుడగుట.
21 వ అధ్యాయము : పురంజయుడు కార్తీక ప్రభావము నెరంగుట.
22 వ అధ్యాయము : పురంజయుడు కార్తీకపౌర్ణమీ వ్రతము చేయుట.
23 వ అధ్యాయము : శ్రీరంగక్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట.
24 వ అధ్యాయము : అంబరీషుని ద్వాదశీ వ్రతము.
25 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని శపించుట.
26 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని శరణు వేడుట.
27 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట.
28 వ అధ్యాయము : విష్ణు (సుదర్శన) చక్ర మహిమ.
29 వ అధ్యాయము : అంబరీషుడు దూర్వాసుని పుజించుట - ద్వాదశీ పారాయణము.
30 వ అధ్యాయము : కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి.
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య
వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment