నాగులచవితి
నాగుల చవితి - కార్తీకశుద్ద చతుర్దశి నాడు - దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. పుట్టిన
బిడ్డలు బ్రతకక పోతేను , పిల్లలు కలుగక పోతేను, నాగ
ప్రతిష్ట చేసి పూజించటం సాంప్రదాయం
. అలా నాగ మహిమతో పుటిన
సంతానానికి, నాగలక్ష్మి, నాగేశ్వరరావు, నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు.
మన పురాణాలలో నాగుల చవితి గురుంచి
ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట
పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు
కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి
నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని నమ్మకం.
ఈ మానవ శరీరమనే పుట్టకు
తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ
శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెనుబాము' అని అంటారు. అందులో
కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో
వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో
నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ,
మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని
కక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున
ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో
ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది,
అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" కు తెల్లని ఆదిశేషువుగా
మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో
పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.
ఈ రోజున ఉదయమే ,తలస్నానము
చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజుకు పూజించి పాలు పోసి చలిమిడి,
చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు
మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ పుట్ట మట్టిని
పుట్టబంగారం అని, దానిని కొద్దిగా
తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు
. ముఖ్యముగా చెవి బాధలు వున్నవారికి
ఈ పుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు.
ఆ సందర్భంగా పుట్ట వద్ద " దీపావళి"
నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా
కాలుస్తారు.
యోగీశ్వరో మహాశయనా కార్తికేయోగ్ని నందనః |
స్కందః కుమారః సేనాని స్వామీ శంకర సంభవః ||
గాంగేయ స్థామ్ర చూడశ్చ బ్రహ్మచారి షికిధ్వజః |
తారకారి ఉమాపుత్ర క్రౌంచారీశ్చ షడాననః ||
శబ్ద బ్రహ్మ సముద్రశ్చ సిద్ధః సారస్వతౌ గుహః |
సనత్ కుమారౌ భగవాన్ భోగ మోక్ష ఫలప్రదః
||
సర జన్మ గణాధీశా పూర్వజో
ముక్తి మార్గకృత్ |
సర్వాగమ ప్రణీతాచ వాంచితార్ధ ప్రదర్శినః ||
అష్ట వింశతి నామాని మదీయానీతి యః పఠేత్ |
ప్రత్యుషే శ్రద్ధయా యుక్తో మూకో వాచ పతిర్భవేత్
||
మహామంత్ర మయానీతి మామనామాను కీర్తనం |
మహా ప్రజ్ఞా మవాప్నోతి నాత్ర కార్య విచారణా ||
వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని
సర్ప నక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు
సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు
ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని
నాగుల చవితి అంటారు. పాములు
అనేవి మనకి పరోక్షంగా చాలా
మేలు చేస్తాయి. భూమి అంతర్భాగాలలో ఉంటూ
భూమిని నాశనం చేసే క్రిముల్ని,
పురుగుల్ని తినేసి మన భూసారాన్ని కాపాడుతూ
నీటి వనరుల కింద ఉపయోగపడతాయి.
అటువంటి పాముల్ని ఈ రోజున కొలిచి
మనకి తిండికి, ఆరోగ్యానికి, సంతానానికి, ఏ రకమయినటువంటి ఇబ్బందులు
కలగకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక
పూజలు చేస్తాము. మన భారతీయుల చాల
ఇళ్ళల్లో ఇలవేల్పు " సుబ్రహ్మణేశ్వరుడే ఆరాధ్య దైవంగా పూజిస్తారు కాబట్టి వారి పేరును చాల
మంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు
వగైరా పేర్లు పెట్తుకుంటూ ఉంటారు.
పుట్టలోని నాగేంద్రస్వామి!! ....
అంటూ తాము పోసిన పాలు
నాగేంద్రుడు తాగితే, తమ మనసులోని కోర్కెలన్నీ
తీరుతాయని భక్తుల నమ్మకం.
ఆలయాలలో నాగదేవతలకు ఘనంగా పూజలు చేస్తారు.
ప్రతి ఏటా నాగులచవితి రోజున
తిరుమలలో కోనేటిరాయుడైన శ్రీవారిని పెద్దశేష వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. అలాగే గురువారం వాహన
సేవకు ఆరోజంతా వుపవాసముండి మరునాడు పారాయణ చేసి భుజిస్తారు. పాముపడగ
నీడ పడితే పశువులకాపరి కూడా
ప్రభువు అవుతాడంటారు !
కాని పాములకు పుట్టలో పాలు పోయడం వల్ల
వాటి ప్రాణాలకు హాని అని,అందుకని
వాటి సహజ నివాసములలో పాలూ,
గుడ్లూ వెయ్యొద్దని చెప్తున్నారు. దానికి బదులు ఇళ్ళలోనే బియ్యం
పిండితో నాగ మూర్తులను చేసి,
వాటికి శాస్త్రోక్తంగా అన్నీ సమర్పించవచ్చు.
ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది
కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును,
పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని
దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూ వస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని
విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా
పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి
అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని
ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే
క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతిపరంగా అవి
మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
నాగుపాముల సహజ నివాసాలను ఉండనిచ్చి,
ప్రకృతిని కాపాడుకుంటే అంతకన్నా గొప్ప పూజ ఇంకొకటి
ఉంటుందా?
తేగలు అంటే చాలా మందికి
చిన్నచూపు కానీ వీటిలో పీచుపదార్ధము
మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది
.ప్రకృతి మనకు అందించిన మంచి
ఆహారము తేగ .
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య
వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment