Wednesday, 27 August 2014

ఋషి పంచమి

ఋషి పంచమి

భాద్రపద శుద్ధ పంచమిని రుషి పంచమిగా వ్యవహరిస్తారు. ఆరోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు. అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కులగురువు వశిష్టుడు. విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి. రుషిపంచమినాడు రామాయణం చదివితే మహర్షులందరినీ తలుచుకున్నట్టే.

వల్లూరి పవన్ కుమార్   
- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ   


వినాయక చవితి

వినాయక చవితి
వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి. పార్వతీపరమేస్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు. పురాణ గాధలలో శివుడు వినాయకుడిని అందరు దేవతలలోకి మిన్నగా ప్రకటించిన రోజు. వినాయకుని జ్ఞానానికి, సంపత్తుకి మరియు మంచి అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడ, లేక కొత్త పనులు చేపట్టేటప్పుడు ప్రార్థించటం సర్వసాధారణం. పండుగ బాధ్రపద మాసంలో శుక్ల చతుర్థి (చందమామ వృద్ధిచెందే 4 రోజున) ప్రారంభమవుతుంది. 19 ఆగష్టు నుండి 15 సెప్టెంబరు మధ్యలో రోజు వుంటుంది. పండుగ 10 రోజులపాటు అనంత చతుర్దశి (వృద్ధిచెందే చందమామ 14 రోజున) ముగుస్తుంది.

వినాయక చవితి
సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు.
పూర్వము గజ రూపము కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి ?' అని అడుగగా, రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరము నందే నివశించాలి' అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివశించ సాగాడు.
కొద్ది రోజులకు పార్వతీ దేవికి విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్ధించి, ' దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తి తో భస్మా సురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఎదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడ వలసింది' అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.
శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయాంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్య కారులుగా మార్చి, గజాసురుని పురానికి వెల్లి సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అనగా, విష్ణుమూర్తి 'ఇది మహమైన నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడిగాడు. వెంటనే కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తూ శ్రీ మహవిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో 'నా శిరస్సును లోకమంతా ఆరాధించ బడే టట్లు గా అనుగ్రహించి, నా చర్మమును నీ వస్త్రము గా ధరించమని' వేడు కొన్నాడు.
అభయమిచ్చిన తరువాత, విష్ణు మూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి 'ఇలా అపాత్ర దానం చేయకూడదు. దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది' అని చెప్పి అంతర్థ

విఘ్నేశాధి పత్యము
ఒక రోజు దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి 'మాకు పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని' కోరారు.
పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. సమస్య పరిష్కరించడానికి శివుడు, 'మీలో ఎవరైతే ముల్లోకముల లోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందు వస్తారో వాళ్లే పదవికి అర్హులు' అన్నాడు. దానికి అంగీకరించిన కుమార స్వామి వెంటనే తన నెమలి వాహనమెక్కి వెళ్లి పోయాడు. గజాననుడు మాత్రం చిన్న బోయిన ముఖంతో 'తండ్రీ! నా బలాబలాలు తెలిసీ మీరిలాంటి షరతు విధించటం సబబేనా ? నేను మీ పాద సేవకుడిని కదా! నా మీద దయ తలచి ఎదైనా తరుణోపాయం చెప్ప'మని కోరాడు. అంతట శివుడు దయతో మంత్రం చెప్పాడు.
'సకృన్నారాయణే త్యుక్త్వా పుమాన్కల్పశత త్రయం! గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక!'
కుమారా! ఇది నారాయణ మంత్రం! ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్య నదులలో స్నానం చేసినట్టవుతుంది. షరతు విధించిందీ తండ్రే, తరుణోపాయం చూపిందీ తండ్రే కాబట్టి, ఇంక తాను గెలవగలనో లేదో, కుమార స్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను ? అని సందేహించకుండా, మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుచూ, మూడు మార్లు తల్లి దండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసములోనే ఉండి పోయాడు.
అక్కడ కుమార స్వామికి, మూడు కోట్ల యాభై నదులలో, నదికెళ్లినా అప్పటికే గజాననుడు నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించే వాడు. అన్ని నదులూ తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అన్నగారు, తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యము ఇవ్వండీ అన్నాడు.'
విధంగా బాధ్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు, విఘ్నేశ్వరుడైనాడు. రోజు అన్ని దేశాల లోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకములైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకము, వడ పప్పు సమర్పించారు. విఘ్నేశ్వరుడు, తృప్తి పడి తిన్నంత తిని, తన వాహనానికి పెట్టి, తీసుకెళ్ల గలిగినంత తీసుకుని భుక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరు కున్నాడు. ఎప్పటిలాగా తల్లి దండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు. చేతులసలు నేల కానితేనా ? పొట్ట వంగితేనా ? అలా విఘ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే, శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పక పకా నవ్వాడు. చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములన్నీదొర్లు కుంటూ బయటకు వచ్చేసాయి.
పార్వతీ దేవి దుఃఖించుచూ, చంద్రుని ఇలా శపించింది. 'ఓరి పాపాత్ముడా! నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు. అందుకని నిన్ను చూసిన వాళ్లు, పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు.'

వినాయక జననము
కైలాసములో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదముగావించి లోపలికి వెళ్లాడు.
అప్పటికే పార్వతీ దేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, గజాసురుని శిరస్సును అతికించి బాలుని బ్రతికించాడు. అందువల్ల 'గజాననుడు'గా పేరు పొందాడు. అతని వాహనము అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు.
కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి పుట్టాడు. అతని వాహనము నెమలి. అతను మహా బలశాలి.

ఋషి పత్నులు నీలాప నిందలు పొందుట
సమయంలోనే సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదిక్షణాలు చేస్తున్నారు. అగ్ని దేవుడు ఋషి పత్నులను చూసి మోహించాడు. కాని ఋషుల శాపాలకు భయ పడ్డాడు. అతని కోరిక గ్రహించిన అగ్ని దేవుని భార్య, ఒక్క అరుంధతీ రూపము తప్ప మిగతా అందరి రూపమూ ధరించి అతనికి ప్రియం చేసింది. ఋషులది చూసి తమ భార్యలేనని తలచి వాళ్లను వదిలి వే్సారు. దీనికి కారణము, వారు చంద్రుని చూడటమే!

దేవతలు, మునులు వెళ్లి శ్రీ మహా విష్ణువుకు విన్నవించుకోగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, అసలు విషయం తెలుసు కుని ఋషులకు వివరించి, వాళ్ల కోపం పోగొట్టాడు. కైలాసమునకు వచ్చి విఘ్నేశ్వరుని పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు. అప్పుడు దేవతలు మొదలగు వారంతా ' పార్వతీ! నీవిచ్చిన శాపం వల్ల లోకానికే ముప్పు. నీ శాపాన్ని ఉపసంహరించు' అన్నారు. పార్వతి కూడా తన కుమారుని ముద్దాడి, ' రోజైతే చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో రోజు చంద్రుని చూడ రాదు' అని శాపోపశమనమును కలుగ చేసింది. రోజు బాధ్రపద శుద్ధ చతుర్థి. రోజు చంద్రుని చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ఇలా కొన్నాళ్లు జరిగింది.

వినాయక నిమజ్జనం
బాధ్రపద శుద్ధ చవితి తరువాత వినాయకుడికి నవరాత్రి పూజలు చెసిన తరువాత, మట్టి వినాయకులను ఆడంబరముగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కాని సముద్రములో కాని నిమజ్జనం చేస్తారు.

వల్లూరి పవన్ కుమార్   
- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ   


వినాయక వ్రతకల్పం-పూజావిధానం

వినాయక వ్రతకల్పం-పూజావిధానం
ఆచమ్య:
ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: - వామనాయ నమ: - శ్రీధరాయ నమ: - హృషీకేశాయ నమ: - పద్మనాభాయ నమ: - దామోదరాయ నమ: - సంకర్షణాయ నమ: - వాసుదేవాయ నమ: - ప్రద్యుమ్నాయ నమ: - అనిరుద్ధాయ నమ: - పురుషోత్తమాయ నమ: - అధోక్ష జాయ నమ: - నారసింహాయ నమ: - అచ్యుతాయ నమ: - జనార్దనాయ నమ: - ఉపేంద్రాయ నమ: - హరమే నమ: - శ్రీ కృష్ణాయ నమ:.
శ్లో!! శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే !!
వినాయక ప్రార్ధన:
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక:
లంబోధరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప:
ధూమకేతు ర్గణాధ్యక్ష:, ఫాలచంద్రో గజానన:
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరమ్బ: స్కన్ద పూరజ:
షోడశైతాని నామాని : పఠే చ్చ్రుణుయా దపి,
విద్యారమ్బే విహహే ప్రవేశే నిర్గమే తథా,
సజ్గ్రామే సర కార్యేషు విఘ్నస్తస్య నజాయతే.
అభీప్సితార్ధసిద్ధ్యర్ధం పూజితో యస్సు రైరపి,
సరవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమ: !!
కలశపూజ :
కలశం గంధపుష్పాక్షతై రాభ్యర్చ్య ( కలశానికి గంధపు బొట్లు పెట్టి, అక్షతలు అద్ది, లోపల ఒఖ పుష్పాన్ని వుంచి.. తదుపరి పాత్రను కుడి చేతితో మూసి క్రింది మంత్రాలను చదవాలి.)
కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యేమాత్రుగణా: స్మృతా: !!
కుక్షౌతు సాగరా: సరే సప్తదీపా వసుంధరా !
ఋగ్వేదో విథ యజుర్వేద: సామవేదో అథర్వణ: !
అంగైశ్చ సహితా: సరే కలశాంబు సమాశ్రితా: !!
ఆయాన్తు దేవ పూజార్ధం దురితక్షయకారకా: !
గంగే యమునే చైవ గోదావరి సరసతి !
నర్మదే సింధూకావేరి జలేవిస్మిన్ సన్నిధిం కురు !!
కలశోదకేన పూజాద్రవ్యాణి దేవమండప మాత్మానం సంప్రోక్ష్య.
(కలశమందలి జలమును చేతిలో పోసికొని, పూజకోఱకై, వస్తువులమీదను దేవుని మండపమునందును తన నెత్తిమీదను చల్లుకొనవలసినది.)
తదంగతేన వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే.
ప్రాణ ప్రతిష్ట :
మం !! అసునీతే పునరస్మాసు చక్షు:
పున: ప్రాణ మిహనో ధేహి భోగమ్,
జ్యోక్సశ్యేమ సూర్య ముచ్చరంత
మనుమతే మృడయాన సస్తి.
అమృతం వై ప్రాణా అమృత మాప: ప్రాణానేవ యథాస్థాన ముపహయతే.
సామిన్ సరజగన్నాథ యావత్పూజావసానకమ్ !
తావత్తం ప్రీతిభావేన బింబే విస్మిన్ సన్నిధిం కురు !!
ఆవాహితో భవ, స్థాపితో భవ , సుప్రసన్నో భవ , వరదో భవ, అవకుంఠితో భవ ,
స్థిరాసనం కురు, ప్రసీద, ప్రసీద, ప్రసీద.
పూజా విధానమ్ :
శ్లోకం: భవసంచితపాఫౌఘవిధంసనవిచక్షం !
విఘ్నాంధకార భాసంతం విఘ్నరాజ మహం భజే !!
ఏకదన్తం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్బుజం !
పాశాంకుశధరం దేవం ధాయే త్సిద్ధివినాయకమ్ !!
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం !
భక్తాభీష్టప్రదం తస్మా ద్ధ్యాయే త్తం విఘ్ననాయకమ్ !!
శ్రీ వరసిద్ధి వినాయకం ధ్యాయామి.
శ్లోకం: అత్రా విగాచ్ఛ జగదంద్య సురరాజార్చితేశర
అనాధనాధ సరజ్ఞ గౌరీగర్బసముద్భవ !!
శ్రీ వరసిద్ధి వినాయకం ఆవాహయామి.
శ్లోకం: మౌక్తికై: పుష్పరాగైశ్చ నానారత్నే రిరాజితం !
రత్నసింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్ !!
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆసనం సమర్పయామి.
శ్లోకం: గౌరీపుత్ర! నమస్తే విస్తు శంకర ప్రియనందన !
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్ష తైర్యుతం !
శ్రీ వరసిద్ధి వినాయకాయ అర్ఘ్యం సమర్పయామి.
శ్లోకం: గజవక్త్ర నమస్తేవిస్తు సరాభీష్టప్రదాయక !
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ దిరదానన !
శ్రీ వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి.
శ్లోకం: అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత !
గృహాణ విచమనం దేవ !తుభ్యం దత్తం మయా ప్రభో
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆచమనీయం సమర్పయామి.
శ్లోకం: దధిక్షీర సమాయుక్తం మాధా హ్హ్యేన సమనితం
మధుపర్కం గృహాణేదం గజవక్త్య నమోవిస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయకాయ మధుపర్కం సమర్పయామి.
శ్లోకం: స్నానం పంచామృతై ర్దేవ గృహాణ గణనాయక
అనాధనాధ సరజ్ఞ గీరాణవరపూజిత !
శ్రీ వరసిద్ధి వినాయకాయ పంచామృతస్నానం సమర్పయామి.
శ్లోకం: యా ఫలిని ర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణి:
బృహస్పతి ప్రసూతా స్తానో ముంచన్తగ్ హస:
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఫలోధకేన సమర్పయామి.
శ్లోకం: గంగాది సరతీర్దేభ్య ఆహ్రుతై రమలైర్జలై :
స్నానం కురుష భగవ న్నుమాపుత్త్ర నమోవిస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయకాయ శుద్దోదక స్నానం సమర్పయామి.
శ్లోకం: రక్తవస్త్రదయం చారు దేవయోగ్యం మంగళం శుభప్రదం గృహాణ తం
లంబోదర హరాత్మజ శ్రీ వరసిద్ధి వినాయకాయ వస్త్రయుగ్మం సమర్పయామి.
శ్లోకం: రాజతం బ్రహ్మసూత్రం కాంచనం చోత్తరీయం గృహాణ దేవ సరజ్ఞ భక్తానా
మిష్టదాయక శ్రీ వరసిద్ధి వినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి.
శ్లోకం: చందనాగురుకర్పూరకస్తూరీ కుంకుమానితం విలేపనం సురశ్రేష్ఠ !
ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్ శ్రీ వరసిద్ధి వినాయకం గంధాన్ సమర్పయామి.
శ్లోకం: అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద
శంభుపుత్ర నమోవిస్తుతే శ్రీ వరసిద్ధి వినాయకాయ అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి.
శ్లోకం: సుగన్ధాని పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోవిస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయకాయ పుష్పై సమర్పయామి.
అథాంగ పూజా:
గణేశాయ నమ: పాదౌపూజయామి !!
ఏకదంతాయ నమ: గుల్పౌ పూజయామి !!
శూర్పకర్ణాయ నమ: జానునీ పూజయామి !!
విఘ్నరాజాయ నమ: జంఘే పూజయామి !!
అఖువాహనాయా నమ: ఊరూ పూజయామి !!
హేరంబాయ నమ: కటిం పూజయామి !!
లంబోదరాయ నమ: ఉదరం పూజయామి !!
గణనాథాయ నమ: హృదయం పూజయామి !!
స్థూలకంఠాయ నమ: కంఠం పూజయామి !!
స్కందాగ్రజాయ నమ: స్కంధౌ పూజయామి !!
పాశహస్తాయ నమ: హస్తౌ పూజయామి !!
గజవక్త్రాయ నమ: వక్త్రం పూజయామి !!
శూర్పకర్ణాయ నమ: కర్ణౌ పూజయామి !!
ఫాలచంద్రాయ నమ: లలాటం పూజయామి !!
సరేశరాయ నమ: శిర: పూజయామి !!
విఘ్నరాజాయ నమ: సరాణి అంగాని పూజయామి !!

శ్రీ వినాయక వ్రత కథ
గణపతి జననము
సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు అతడు అజేయుడైనాడు
భర్తకు కలిగిన స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాదు నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించినాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో" అన్నాడు విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై నందీశ్వరుడు వచ్చినాడు శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించినాడు అయినా మాట తప్పుట కుదరదు కుక్షియందున్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది" అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు
అక్కడ పార్వతి భర్త రాకను గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, మంత్రముతో ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసినది దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది
శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు
జరిగిన దానిని విని పార్వతి విలపించింది శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును బాలుని మొండెమునకు అతికి శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించినాడు గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి:
గణేశుడు అగ్రపూజనీయుడు
ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి? గజాననునికి స్థానము కలుగవలసి ఉంది శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు స్థానమును కోరినాదు శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఆధిపత్యము లభిస్తుందన్నాడు కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు గజాననుడుమిగిలిపోయినాడు త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించినాడు వినాయకుని బుద్ది సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు అనగా మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు వినాయకునికే ఆధిపత్యము లభించినది
చంద్రుని పరిహాసం
గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు

(చంద్రుడుమనస్సుకు సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడనను సరణీయుడైనాడు ఆతని మాన్యత నశించింది నింద్యుడయినాడు ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు అవుతారు నిందలకు గురియగుతారు
చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించినారు. కరుణామయుడగు దేవుడు విముక్తికై ఉపాయము సూచించినాడు. బాధ్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించినాడు.
ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడినది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడినది.
వల్లూరి పవన్ కుమార్    
- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ