Wednesday, 30 July 2014

త్రినగర బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం ( బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ )

శ్రీ లలితా గాయత్రి బ్రాహ్మణ సహకార సేవ సంఘం

త్రినగర బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం
 ( ఖాజిపేట , వరంగల్ , హన్మకొండ )

వేదిక : శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవస్ధానం,  శ్రీ రాఘవేంద్ర స్వామి దేవస్ధానం ప్రక్కన, పరిమళ కాలనీ , హన్మకొండ

ఆహ్వానించువారు
శ్రీ లలితా గాయత్రి బ్రాహ్మణ సహకార సేవ సంఘం
హన్మకొండ శాఖ
( బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ )
సెల్ : 9949019228 , 9441136996
 

Tuesday, 29 July 2014

శ్రీ ఆండాళ్ తిరునక్షత్రం

శ్రీ ఆండాళ్ తిరునక్షత్రం
రోజు ఆండాళ్ తల్లి పుట్టిన రోజు. కలియుగం ప్రారంభం అయిన 93 సంవత్సరంలో ఆండాళ్ తల్లి అవతరించినది. కలియుగం ఆరంభం అయిన తరువాత నర నామ సంవత్సరంలో పూర్వ పాల్గుని నక్షత్రంలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా శ్రావణమాస ఆరంభం అయ్యిన తరువాత ఆండాళ్ తల్లి తులసి వనంలో విష్ణుచిత్తుల వారికి లభించినది. విష్ణుచిత్తులు చాలా భక్తి కల మహనీయుడు, అందుకే లోకం పెరియ ఆళ్వార్ అని కీర్తించేది. భగవత్ ప్రేమవిషయంలో పెద్దరికం కల వాడు. ఆళ్వార్ అంటే భగవత్ ప్రేమ సాగరంలో మునిగి తేలినవాడు అని అర్థం. భగవత్ ప్రేమ అనేది ఒక పెద్ద సాగరం అని అనుకుంటే, అందులో మునిగి, అడుగుదాకా వెల్లి తిరిగి బయటికి వచ్చి, ఇంత ఉంది సుమా! అని బయటి లోకానికి తెలియజేసిన వాల్లను ఆళ్వారులు అని అంటాం. ఆళ్వారులు ద్వాపరంలో ఒక నలుగురు, కలియుగంలో మొదటి శతాబ్దానికి చెందినవారు ఒక ఆరుగురు. నమ్మాళ్వార్ తోపాటు ఆయన శిష్యుడైన మధుర కవి, ఇక విష్ణుచిత్తులవారి కుమార్తెగా ఆండాళ్ తో కలిసి మొత్తం పన్నెండు మంది ఆళ్వారులు. భగవంతుడు అంటే ఏమిటి, ఆయనను ఎట్లా ప్రేమించాలి అని లోకానికి ఆవిష్కరించిన మహనీయులు వీల్లంతా.
కర్కటే పూర్వఫల్గున్యాం తులసికాననోద్భవామ్ |
పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమ్||
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భూంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః
విష్ణుచిత్తులవారు పాండ్య దేశపు సభకు వెల్లి, భగవంతుని అనుగ్రహంచే, తత్వం అంటే ఇట్లా ఉంటుంది అని నిర్ణయంచేసిన మహనీయుడు. పాండ్య రాజు ఆయనని ఏనుగు అంబారి పై ఉరేగించి బట్టర్పిరాన్ అని బిరుదిచ్చారు. అప్పుడు రాజుద్వారా ఆందిన సంపదతో శ్రీవెల్లిపుత్తుర్ ఆలయ గోపురం, ప్రాకారాదులకు కైకర్యంగా వినియోగించారు. తులసివనం పెంచి, తులసి మాలలను కట్టి స్వామికి అర్పించేవాడు ప్రతి దినం. ఒకనాడు ఆయనకు ఒక పాప తులసి వనంలో లభించింది. ఆయనకు సంతానం లేకపోవడంచే ఆమెపై మమకారంతో కృష్ణుడిగా భావించి పెంచాడు. శ్రీకృష్ణుడు యశోదమ్మకి కనకుండానే లభించాడో, ఈయన తను యశోదగా భావించి పిల్లని శ్రీకృష్ణ అంశగా భావించి పెంచుకున్నాడు. తులసి మాలని తమిళంలో కోదై అంటారు, ఆమెకు కోదా అని పేరు పెట్టుకున్నాడు. సంస్కృతంలో అది క్రమేపి గోదాగా మారింది. భగవంతుని కథలు గోదాదేవికి చెప్పుతూ పెంచారు ఆమె తండ్రి,అలా శ్రీకృష్ణ భక్తితో పెరిగింది. ఆమెను కృష్ణుడిగా భావిస్తూ తనను యశోదగా భావిస్తు విష్ణుచిత్తులవారు ఎన్నో పాటలు పాడేవారు. శ్రీకృష్ణుడి జ్ఞానం కల్గిఉండటంచే ఆయనను ఎలాపొందాలని కోరిక కల్గితే, వాల్ల తండ్రి వివిద దివ్యదేశాల గురించి తెలిపాడు. శ్రీరంగనాథున్ని ప్రేమించింది గోదాదేవి. ఒకప్పుడు విభవంలో మన వద్దకు శ్రీకృష్ణుడిగా వచ్చినప్పడిలా ఇప్పుడు అర్చామూర్తిగా ఉన్నాడని తెలుసుకొని అట్లాంటి అనుభూతిని పొందింది గోదా. తన చుట్టు ఉన్న ఊరినే నందగోకులంలా, తన చుట్టూ వారినే గోపికలవలె, వూరి వటపత్రశాయి మందిరాన్నే నందగోప భవనంగా భావించిందిఆనాడు గోపికలు చేసిన వ్రతాన్ని తాను చేసింది. అలా భావిస్తూ రోజుకో పాటని పాడేది. మరి మాములు పాటలు కావు, సర్వ వేద సారం అని పిలవబడే తిరుప్పావై అనే ముప్పై పాటల్ని పాడింది గోదా. ఇంకా భగవంతుని దర్శనం కల్గలేదు, అప్పుడు తన వేదనని తెలియజేస్తూ నాచియార్ తిరుమొఱ్ఱి అనే మరొక నూట నలభై మూడు పాటల దివ్య ప్రబంధాన్ని పాడింది.అప్పుడు అర్చామూర్తిగా ఉన్న రంగనాథుడు చలించి, తన వద్ద ఉన్న అర్చకుడిని ఆదేశించి గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూర్ నుండి పిలిపించుకుని, శ్రీరంగ క్షేత్రంలో రంగవిళాస మండపంలో మానవ కన్యగా ఉన్న ఆమెను వివాహమాడాడు. అమె స్వామి సన్నిదానంలో చేరిపోయిందితండ్రిగారు అయ్యో నా గోదా ఏది అని విలపిస్తుంటే, భగవత్ తత్వం తెలిసినవాడైనందుకు రంగనాథుడు విగ్రహరూపంలోనే ఆయనతో విలపించవలదు మీరు మీ వూరికి వెల్లండి, నేను గోదా దేవితో పాటు అక్కడికి వస్తాను అని ఆదేశించాడు.
విష్ణుచిత్తులవారు శ్రీవిల్లిపుత్తూర్ చేరగానే స్వామి రంగమన్నార్, అంటే రంగరాజుగా గరుడవాహనంపై గోదాదేవితో కల్సి వేంచేసాడు. శ్రీవిల్లిపుత్తూరులో అసలు దేవాలయం వటపత్రశాయిదే, కాని గోదాదేవి రంగనాథుడిని పొందాక, గోదాదేవి ఆలయం తర్వాత ప్రసిద్ది చెందినది. పెద్దగోపురం కనిపించేది వటపత్రశాయి ఆలయంకు చెందినది. ప్రక్కన గోదాదేవి నివసించే ఇల్లు ఆమె మందిరంగా ఉంది ఈనాటికి కూడా. ఆగోదాదేవి అలా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా అవతరించి భూమినంతా తరింపజేసింది. తల్లి తన పిల్లల్ని స్తన్యముల ద్వారా పోశిస్తుందో, అలా గోదాదేవి తిరుప్పావై, నాచియార్ తిరుమొఱ్ఱి అనే రెండు దివ్యప్రబంధాలను లోకానికి ఇచ్చి జీవరాశినంతా పోశిస్తుంది.
రామచంద్రుడిని వివాహమాడిన సీతాదేవి కంటే గోదాదేవే ఒక్క అడుగు ముందు అని అంటుంటారు. ఇద్దరూ అయోనిజలే, భూమిలో లభించినవారు. యజ్ఞానికి అని మామూలు క్షేత్రాన్ని దున్నుతుంటే సీతమ్మ లభించింది, పరమాత్మకు అర్పించదగిన పరిశుద్దమైన తులసివనంలో మన అమ్మ గోదా లభించినది. తులసికి వేరు మొదలుకొని చివరిదాకా అణువణువునా పరిమళం నిండి ఉన్నట్టుగానే గోదాదేవి తనలో ఉండే ప్రతి ప్రవృత్తిలో కూడా శ్రీకృష్ణ ప్రేమ పరిమళం నిండి ఉంది. ఇక పెంచినవాడిని చూస్తే, జనక చక్రవర్తి కర్మ యోగి, పరిపాలకుడు. గోదాదేవిని పెంచిన విష్ణుచిత్తులు భక్త శిఖామణి, పరమ వైదికోత్తముడు. వంశంలో కూడా గోదా ఒక మెట్టు ఎక్కువే! ఇక చేపట్టిన వాడిని చూద్దామా అంటే ఆయన రాముడు, మరి గోదా చేపట్టిన ఆయన రంగనాథుడు, శ్రీరాముని ఇలవేల్పు. అంటే గోదాదేవి సీతారాములకే ఆరాధ్య స్థానాన్ని పొందింది. సీతాదేవి ఇలా చెయ్యండి అంటూ మనకేమి చెప్పలేదు, కాని గోదా దేవి మనకు ఎన్నో నియమాలు, ధర్మాలు నేర్పింది.రామచంద్రుడు ప్రక్కన ఉండగా లేడిని కోరి కష్టాలను తెచ్చి పెట్టుకుంది సీత, కానీ ఆండాళ్ తల్లి "ఉన్నై అరిత్తిత్తు వందోంమెం నిన్ను కోరివచ్చాం, "పఱై తరుతియాగిల్" నీవు ఇచ్చేవి కోరి రాలేదు అని చెప్పింది. దొంగని కాదు దండించేది, దొంగలోని దొంగ అనే ప్రవృత్తిని దండించాలి అని ఈనాడు పెద్ద పెద్ద దేశాలు చెబుతున్నారే ఆమాటలు గోదా మనకు ఎప్పుడో చెప్పింది. "మత్తారై మాత్త్-అఱిక్క వల్లాన్" శత్రువులలోని శత్రుత్వాన్ని దండించి తొలగించ గలిగేవాడు మా స్వామి అని ఎన్నో గొప్ప గొప్ప మాటల్ని తెలిపింది అమ్మ గోదా. ప్రకృతి సౌందర్యంలో భగవంతుణ్ణి ఎట్లా చూడాలో నేర్పింది అమ్మ గోదా. శాస్త్ర సారమైన ఎన్నో రహస్యాల్ని అందమైన పాటలుగా అందించింది గోదా. అలా గోదాదేవి ఒక మెట్టు ఎక్కువే, ఆమెకు సాటి ఎవ్వరులేరు. ఆమె పేరు పెట్టుకున్నందుకు గోదావరి నది పవిత్రం అయ్యింది. ఆమె శ్రీరంగంలో రంగనాథుడిని చేరినందువల్ల కావేరీ నది పవిత్రం అయ్యింది. తను స్వామి సన్నిదానం చేరే ముందు మనల్ని అందరిని భాగుచేస్తానని వాగ్దానం చేసింది. మరి స్వామి ఫలింప చేస్తాడా అంటే, ఆమెను పాణిగ్రహణం చేసాడంటే స్వామి ఒప్పుకున్నట్టే కదా. మార్గాన్ని మనం ఆశ్రయిస్తే చాలు మనం పరమాత్మను  తప్పక అందుకోగలం. గోదాదేవి ధరించి విడచిన మాలని కదా స్వామి ధరించాడు. అందుకే ఈనాటికి శ్రీవెంకటేశుడు బ్రహ్మోత్సవాల్లో శ్రీవిల్లి పుత్తూర్ నుండి గోదా ధరించిన మాలనే తెప్పించుకొని ధరించి, గోదా చేపట్టిని చిలుకనీ తాను చేత ధరించి, పొంగిపోతూ ఊరేగుతాడు. భగవంతుడికి గోదా ధరించిన మాల అంటే అంత ప్రేమ. ఆమె పాటలని మనం పాడుకోగల్గితే తరించిపోతాం.

వల్లూరి పవన్ కుమార్    

- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ 

Monday, 28 July 2014

శ్రావణ మంగళవారం "మంగళ గౌరీవ్రతం"

శ్రావణ మంగళవారం "మంగళ గౌరీవ్రతం"
విధానం : శ్రావణ మంగళవారం వ్రతం నిర్వహించుకున్న మొదటి సంవత్సరంలో అయిదుగురు ముత్తయిదులను పిలిచి, వారికి పసుపురాసి, బొట్టు పెట్టి, కాటుకిచ్చి, శనగలూ, కొబ్బరి వగైరా వంటివి వాయనాలు ఇవ్వాలి. ఇదే విధంగా రెండవసంవత్సరంలో పదిమంది ముత్తయిదువులని, మూడవ సంవత్సరంలో పదిహేనుమంది, నాలుగోసంవత్సరంలో ఇరవైమంది, అయిదవ సంవత్సరంలో ఇరవైఅయిదుమంది ముత్తయిదువులను పిలిచి వాయనాలివ్వాలి. అయిదేళ్ల తరువాత ఉద్యాపన చేయాలి.
ఉద్యాపన : అయిదేళ్ళయ్యాక ముప్ఫయి మూడు జతల అరిసెలను ఒక కొత్త కుండలో పెట్టి, ఆ పైన కొత్త రవికెల గుడ్డతో వాసెన గట్టి, మట్టేలూ మంగళసూత్రాలూ వగైరా మంగళాభరణాలతో పెళ్ళి కూతురుకు వాయనమియ్యాలి. పద్దతి లోపించినా ఫలితం లోపించదు.
మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు?
శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. శ్రావణ మాసంలో ఎన్ని మంగళ వారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటి లోనూ, ఆ తరువాతి నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమ శివుడు కూడా మంగళగౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి.
వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.
వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.
వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. (శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వచును)
ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు.
ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి.
పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి.
మంగళగౌరీ వ్రత విధానం :
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వెయవలెను)
విష్ణవే నమః     మధుసూదనాయ నమః    త్రివిక్రమాయ నమః    వామనాయ నమః     శ్రీధరాయ నమః
ఋషీకేశాయ నమః     పద్మనాభాయ నమః   దామోదరాయ నమః     సంకర్షణాయ నమః   వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః   అనిరుద్దాయ నమః    పురుషోత్తమాయ నమః   అధోక్షజాయ నమః    నారసింహాయ నమః
అచ్యుతాయ నమః    జనార్ధనాయ నమః    ఉపేంద్రాయ నమః      హరయే నమః     శ్రీ కృష్ణాయ నమః

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||
(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

శుక్లాంబరధరం విష్ణుం  శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

ఓం లక్ష్మినారాయణభ్యయం నమః     శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమః
శ్రీ వాణిహిరణ్యగర్భాభ్యం నమః     శ్రీ శచిపురంధరాభ్యం నమః
శ్రీ అరుంధతివసిష్టాభ్యం నమః    శ్రీ  సీతారామాభ్యం నమః
సర్వేభ్యో దేవేభ్యో నమః   మాతృభ్యో నమః,  పితృభ్యో నమః

ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మంగళ గౌరీ ప్రీత్యర్ధం అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) దక్షిణాయనే,వర్ష ఋతవ్, శ్రావణ మాసే, శుక్ల పక్షే ,  శుభ తిథౌ, శుక్రవాసరే,  శుభనక్షత్రే (ఈరోజు నక్షత్రము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ (పేరు) అహం మమోపాత్త దురితక్షయద్వారా యావజ్జీవ సామాంగల్య సిద్ధ్యర్థ పుత్ర, పౌత్ర సంపత్సౌభాగ్య సిద్ధ్యర్థం మమ వివాహ ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతరం శ్రీమంగళగౌరీ వ్రతం కరిష్యే. అద్య శ్రీ మంగళగౌరీ దేవతా ముద్దిశ్య శ్రీ మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం, సంభవద్భిర్త్రవై: సంభవితానియమేన ధ్యానవాహనాది షాడోశోపచార పూజాం కరిష్యే.
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

శ్లో :  కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం :  ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(నీరు నివేదన చుట్టూ చల్లుతూ) సత్యం త్వర్తేన పరిషించామి, అమ్రుతమస్తు అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహో, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహో గూడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.(నీటిని వదలాలి).

శ్రీ మహాగణాథిపతయే నమ: తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి.

శ్రీ మహాగణాథిపతయే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి.

అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవత: సర్వాత్మక: శ్రీ గణపతిర్దేవతా

సుప్రీత, సుప్రసన్న వరాదభవతు ! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు !!

వినాయకునికి నమస్కరించి అక్షతలు తల మీద చల్లుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. పూజను ప్రారంభించే ముందు తోరణములను తయారు చేసుకోవాలి.

తోర పూజ :

తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు పూలు, ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు పోగుల దారమును ఉపయోగించి, ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరములను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.

అనంతరం మంగళ గౌరీ పూజ ప్రారంభం  –  శ్రీ మంగళ గౌరీ ధ్యానమ్ :

ఓం శ్రీ మంగళ గౌరీ ఆవాహయామి

ఓం శ్రీ  గౌరీ రత్నసింహాసనం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ  అర్జ్యం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ పాద్యం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ ఆచమనీయం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ పంచామృతస్నానం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ శుద్ధోదకస్నానం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ వస్త్రయుగ్నం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ ఆభరణానే సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ మాంగల్యం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ గంధం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ అక్షాతన్ సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ పుష్పాణి సమర్పయామి

అంటూ వరుసగా చదువుకోవాలి. ఆయా ద్రవ్యాల పేరులు చెప్పేటప్పుడు దేవికి అని సమర్పించాలి.

రత్నసింహాసనాలు, బంగారు మాంగల్యం లాంటివి సమర్పించడం మనకు సాధ్యం కాదు కాబట్టి వీటికి బదులుగా అక్షింతలు లేదా పువ్వులు సమర్పించవచ్చు.

తరువాత శ్రీ మంగళ గౌరీ అష్టోత్తర నామములు ( శ్రీ గౌరీ అస్తోతరములు) చదవండి ..

ఆ తరువాత ఈ విధంగా చేయాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ ధూపం ఆఘ్రాపయామి – అగరువత్తులు వెలిగించి చూపించాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ దీపం దర్శయామి. కుందులలో నూనెపోసి వత్తులు వేసి దీపారాధన చేసి చూపించాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పించాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ తాంబూలం సమర్పయామి తమలపాకులు వక్కలతో తాంబూలం సమర్పించాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ నీరాజనం సమర్పయామి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ మంత్రపుష్పం సమర్పయామి పువ్వులు వేయాలి.

ఓం శ్రీ మంగళ గౌరీమీ ప్రదక్షిణ నమస్కాన్ సమర్పయామి ప్రదక్షిణలు చేయాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ నమస్కారన్ సమర్పయామి. నమస్కరించాలి.

శ్రీ మంగళ గౌరీ  వ్రతకథ :
పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. కానీ వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం కలగలేదు. ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందునుంచి వెళ్లే భిక్షకుని జోలెలో బంగారం వేయగా, అతను కోపించి సంతానం కలుగకుండుగాక అని శపించాడు. దాంతో ఆ దంపతులు అతణ్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి ‘మంగళ గౌరీ వ్రతం’ చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావంవల్ల ఈ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచించాడు.

అనంతరం వారు సంతానవంతులై కుమారునికి పదహారేళ్ల వయసురాగానే కాశీకి వెళ్లే వీరికి మార్గ మధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసిన తల్లి గల ‘సుశీల’ అనే కన్యతారస పడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు. ఆమె సాహచర్యంతో భర్తకు పదహారేండ్ల అకాల మరణం ఉన్నా ‘మంగళగౌరీ’ వ్రతవాయినం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాష్కుడవు తాడు. కాబట్టిన శ్రావణ మంగళ గౌరీ వ్రతా చరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి.

మంగళ గౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ అర్చించడం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువలను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి.

ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొన దగింది తోరపూజ. పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు. ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కడ్తారు. ఈ తోరాలను గౌరీ దేవి ముందు పెట్టి పూజచేసి ఒక తోరాన్ని పూజచేసిన వారు కట్టుకుంటారు. రెండవ తోరాన్ని ముత్తైదువకు ఇస్తారు. మూడో తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు. ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంచాఫలసిద్ధి కలుగుతుంది.

ఈ వ్రతంలో ఆకులు, వక్కలు ఐదేసిచొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు. తరువాత వాటిని సెనగలతో కలిపి తల్లికిగాని, బ్రాహ్మణ ముత్తైదువకు గాని వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం.మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యడు. ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అయిదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు.
వల్లూరి పవన్ కుమార్    
- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ


Sunday, 27 July 2014

స్వర్ణ గౌరీ వ్రతం

స్వర్ణ గౌరీ వ్రతం
శ్రావణ మాసం వచ్చిందంటేచాలు ... నోములు - వ్రతాలతో చాలా వరకూ ఇళ్లన్నీ కళ కళలాడుతూ కనిపిస్తుంటాయి. మాసంలో వివాహిత స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో 'స్వర్ణ గౌరీ నోము' నోచుకుంటూ వుంటారు. సిరిసంపదలు ... ఆయురారోగ్యాలు పొందడానికి గాను, 'శ్రావణ శుక్ల తదియ' రోజున నోమును నోచుకుంటారు. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. పసుపు కుంకుమలతో అలంకరించిన పీఠంపై గౌరీదేవి చిత్రపటాన్ని వుంచి 16 ముడులుగల తోరం ధరించి షోడశోపచార పూజ చేయాలి. తరువాత కథ చదువుకుని అక్షింతలు తలపై వేసుకోవాలి.
ఇక నోముకి కారణమైన కథ విషయానికి వస్తే, పూర్వం ఒక రాజు వేటకి వెళ్ళిన సందర్భంలో నదీ తీరాన కొందరు ఏదో పూజ చేస్తున్నట్టుగా కనిపించడంతో, విషయమేమిటని వాళ్లని అడుగుతాడు. 'స్వర్ణగౌరీ నోము' నోచుకుంటున్నట్టుగా వాళ్లు చెప్పడంతో, విధి విధానాలు తెలుసుకుని ఇంటికి తిరిగివస్తాడు. ఇద్దరు భార్యలకి నోము గురించి చెప్పి, ఆచరించ వలసిందిగా కోరతాడు.
విషయాన్ని కొట్టిపారేసిన పెద్దరాణి రాజుకి దూరమవుతుంది. చిన్నరాణికి ఆశించినవి లభిస్తాయి. తన తప్పు తెలుసుకున్న పెద్దరాణి నోమును ఆచరించడంతో తిరిగి రాజు ఆదరణను పొందుతుంది. కథ పూర్తి అయిన తరువాత 16 రకాల పండ్లను ... 16 రకాల పిండి వంటలను గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. తమ తాహతుకి తగినట్టుగా బ్రాహ్మణులకు దానాలు చెయ్యాలి.
ఇలా 16 సంవత్సరములు చేశాక పార్వతీ పరమేశ్వరులకు వస్త్రాలను సమర్పించి, రోజున 16 రకాల వంటకాలను ... ఫలాలను 16 మంది ముత్తైదువులకు మూసివాయనమివ్వాలి. దాంతో ఉద్యాపన కార్యక్రమం పూర్తవుతుంది.
వల్లూరి పవన్ కుమార్    
- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ 


Saturday, 26 July 2014

శ్రావణ మాస విశిష్టత

శ్రావణ మాస విశిష్టత
శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరహ జయన్తి  ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.
శ్రావణ సోమవారం
మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడం గా నమ్ముతారు
శ్రావణ మంగళవారం
శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము మాసం లో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక  ఐదు సంవత్సరాలు వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం వ్రతాన్ని  నోచుకొంటారు.
శ్రావణ శుక్రవారం
మాసం లో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవి ని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని పెద్దలు చెప్పారు. లక్ష్మి దేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయిలక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు రీతి లో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం 
శ్రావణ శనివారాలు
మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది
శ్రావణ పౌర్ణమి
శ్రావణ పౌర్ణమి , జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి .
జంధ్యాన్ని యగ్నోపవీతమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు
రక్షా బంధనం
శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక , కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటి నుండి వస్తున్నా సంప్రదాయమేనని తెలుస్తోంది.

వల్లూరి పవన్ కుమార్    
- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ