అమ్మకు వందనం
‘ప్రేమకు అర్థం తెలియాలంటే చూడాల్సింది
నిఘంటువు కాదు, అమ్మ ముఖాన్ని...’
అన్నాడో కవి అది అక్షర
సత్యం... అమ్మ అన్న దేవత
లేకపోతే... నేను, నువ్వు, మనం...
ఈ సమస్త మానవాళి ఉండదు.
అలాంటి అమృతమయి మాతృమూర్తిని తలుచుకునేందుకు మనకు ఓ రోజు
ఉంది అదే ‘మదర్స్ డే’
ప్రతి ఏటా మే రెండవ
ఆదివారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగే ‘అంతర్జాతీయ మాతృ దినోత్సవం’...
ఆత్మానురాగం... ప్రేమ బాంధవ్యాలను పంచే
అమ్మ అనురాగం మాటల్లో చెప్ప లేనిది. నవమాసాలు
మోసి, తన పిల్లల కోసం
పరితపిస్తుంది అమ్మ. ఆకాశమంత ప్రేమ
అందించే అమ్మ తన పిల్లలు
పెరిగి, ఎంత పెద్దవారైనా... పసి
పిల్లాడిగానే తపి స్తుంది. సృష్టికి
మూలమైన ‘అమ్మ’ కోసం ప్రతి
సంవత్సరం ఘనంగా జరుపుకునేదే ‘మదర్స్
డే’. అమ్మ కమ్మని ప్రేమను
గుర్తు చేసుకుని... తమ అభిమానాన్ని చాటుకు
‘మదర్స్ డే’కు కూతుళ్లు,
కొడుకులు, స్వచ్ఛంధ సంస్థలు, వృద్ధాశ్ర మాలు వేడుకను జరుపుకుంటోంది.
బిజీగా ఉండే వారు కొందురు...
దేశ, విదేశాల్లో ఉండే మరి కొందరు
ఈ మెయిల్స్, గ్రీటింగ్స్ కార్డ్‌స ద్వారా శుభాకాంక్షలు
తెలుపుతుండగా, కొందరు ఖరీదైన బహుమతులు అందజేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు.
పెదవే పలికిన మాటల్లోని తియ్యని మాటే అమ్మ... నడిచే
దేవత అమ్మ అని ఓ
సినీ కవి అద్భుతంగా అమ్మ
గొప్పతనాన్ని వివరిం చారు. మాటలు నేర్చుకుంటున్న
బుజ్జాయి తొలి పలుకు అమ్మ...
ఊహ తెలిసే క్షణానికి మొదటి గురువు అమ్మ.
చివరికి బాధ కలిగితే నోటి
వెంట వచ్చే తొలి ఆర్తనాదం
కూడా అమ్మే. తాను కొవ్వొత్తిలా కరిగిపో
తూ... పిల్లలకు వెలుగునిచ్చే అమ్మ రుణం ఎన్ని
జన్మలెత్తినా తీర్చుకోలేం...
జన్మనిచ్చిన తల్లికి ప్రతి ప్రాణి జన్మజన్మలకి
ఋణపడి ఉంటుంది. ఎందుకంటే ఇవ్వ టమే కానీ
తీసుకోవడం తెలియదు తల్లి మనసుకి. మాతృప్రేమలోని
మాధు ర్యం... తల్లిఒడిలోని వెచ్చదనం గురించి వర్ణించడానికి మాటలు చాలవు. అంబరాన్నంటే
అమ్మప్రేమను ఎంద రో కవులు
ఎన్నోరకాలుగా వర్ణిం చారు. అమ్మంటే అనురాగ
దేవత. మన జీవితానికి బంగా
రు బాటలు వేసే అమృత
మయి అమ్మ. అవమానా లెదురైనా...
అపార్థాలు తలెత్తినా... ఏనాటికీ మనల్ని వీడిపోని బంధమే...
తల్లీబిడ్డల సంబంధం. కుటుంబం కోసం... తన సరదాల్ని ఇష్టా
ల్ని... త్యాగం చేస్తుంది తల్లి. తన బిడ్డలకోసం ఎన్నింటినో
త్యాగం చేసే అమ్మ చివరికి
ప్రాణత్యాగానికి కూడా వెనుకాడదు. రక్త
మాంసాలను పంచిన ఆ మాతృమూర్తి
తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉం టుంది. కాలం
మారుతున్న కొద్దీ తల్లిబిడ్డల సంబంధంలో కూడా మార్పులొస్తున్నాయి. నవ మాసాలు
మోసి కనిపెంచిన తల్లిని భారంగా భావిస్తున్నారు కొందరు పిల్లలు. వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. ప్రాణానికి ప్రాణంగా పెంచి పెద్ద చేసిన
మాతృమూర్తిని మరిచిపోతున్నారు. అమ్మను బాధ పెడితే... సమస్త
దేవతల్ని బాధ పెట్టినట్లే. ఈ
నిజం తెలుసుకున్నవారే నిజమైన పిల్లలు.
- బ్రాహ్మణ సంఘం వరంగల్
అర్బన్ శాఖ
No comments:
Post a Comment