ఆనాడు ,
ఏ బాసవారైనా అచ్చట బానిసలే
గట్టిగా ఊపిరి పీల్చనీయకుండా
వెట్టి చాకిరీతో ఊపిరి పీల్చేవారు
కడుపు పట్టుకొని చేత్తో
కడుపుకి కట్టుకున్న పసికందులతో
పగలనక రాత్రనక
నడుం వంచి , నడిఎండలో
వెట్టి చాకిరీ చేయించేవారు
వట్టి చేతులు చూపేవారు
వారే ఆ తెలివిమీరిన తెల్లవారు
,
తెల్ల గుఱ్ఱాల తేరుపై
ఇంద్ర పదవులను అనుభవిస్తున్నారు,
ఆ తెలివిమీరిన తెల్లవారు .
అది కామందుల మతం , కాదు
కామందులుగా కనపడే రాబందుల మదం
ఈ కామందులనే రాబందులపై
ప్రశ్నల బాణాలు గుప్పించింది
మారుతున్న యువతరం
" మేం మనుషులమే , పశువులం
కాదు "
పశువులకీ ఉంది స్వేఛ్ఛ
మాకూ కావాలి స్వేఛ్ఛ
8 గంటల చాకిరే చేస్తాం
అంతకుమించి చేసేవి సమ్మెలు
దేనికైనా ఉండాలి మితం
మితంగా ఉండటమే మా మతం
ఇదే మా అందరి సమ్మతం
చికాగో శ్రామికులు
ఎన్నో పోరాటాలు జరిపి
కోలాటాలు మ్రోగించి ,
ప్రాణాలు పణంగా ఒడ్డారు
ఇదే ఆ డే
ఆ డే మే డే
నేడే
చికాగో కార్మికులు
చిరస్మరణీయులు సదా
.
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment