Friday, 11 March 2016

పుత్ర గణపతి వ్రతం

http://www.vipravanam.com/
ఫాల్గుణ శుద్ధ చవితినాడు పుత్రగణపతి వ్రతం. వినాయక చవితి విధానంలోనే చేసే వ్రతం ఇది. గణపతిని పుత్రసంతానం కోసం పూజిస్తూ ఆచరించే వ్రతం ఇది. కేతువు అనుగ్రహానికి వినాయక చవతి, సంకష్టహర చతుర్థి, పుత్రగణపతి వ్రతాలు చేస్తే ఫలింత వుంటుందని సిద్ధాంతాలు చెపుతున్నాయి.

గణపతి శబ్ద బ్రహ్మస్వరూపము . అంటే ఓంకారానికి ప్రతీక . మంత్రాలన్నింటికీ ముందు ఓంకారము ఎలా ఉంటుందో అలా అన్ని శుభకార్యాలకు ప్రారంభంలో గణేశపూజ విధిగా ఉంటుంది . గణేశుడు ఆది , అంతం లేని ఆనందమూర్తి , సకల సంపత్తులనిచ్చే సిద్ధిదేవత . ఓంకారనాదం ఉద్భవించి , నాదం క్రమక్రమం గా గజానరూపం గా వెలుగొందింది . గణపతిని ఓంకారస్వరూపునిగా " గణపత్యధర్వశీర్షం " కూడా పేర్కొన్నది . దేవతాగణాలకు ఆదిపురుషుడై , అధిపుడై ఉద్భవించడం వల్లనే ఈయనకు గణనాధుడని , గణేశుడని , గణపతి అని పేర్లు వచ్చాయి . ఆకృతిని బట్టి కొన్నిపేర్లు , ఆధిపత్యాన్ని అనుసరించి కొన్ని పేర్లు గణపతికి కలిగినప్పటికీ ప్రధానము గా దైవం గణాలకు నాయకుడు .

రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను ... పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.

పూర్వం మహారాజులు ... చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్లంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్లు భావించేవాళ్లు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్లు పుత్ర సంతానం కోసం ఆరాటపడే వాళ్లు. ఇందుకోసం వాళ్లు 'ఫాల్గుణ శుద్ధ చవితి' రోజున 'పుత్ర గణపతి' వ్రతాన్ని ఆచరించే వాళ్లు.

అలా రోజున వ్రతాన్ని ఆచరించి పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.

ఇక రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయినా ... రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా 'పుత్రగణపతి వ్రతం' మాత్రం నాటి నుంచి నేటి వరకూ ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి, పరిశుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశస్థాపన చేసి ... శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్రగణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.

ఇంచుమించు వినాయకచవితి వ్రతంలానే వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకితభావంతో చెప్పుకోవాలి. బుద్ధిమంతుడు ... జ్ఞానవంతుడు ... ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతికాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు.

ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి. మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకితభావంతో గణపతిని మెప్పిస్తారో దంపతులకు అనతికాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.
    వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ




Wednesday, 9 March 2016

ఫాల్గుణ మాసం విశిష్టత

http://www.vipravanam.com/
      ఉత్తరఫల్గుణి నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రునితో కలిసి ఉన్నందువల్ల మాసానికి ఫాల్గుణమాసం అని పేరు వచ్చింది. ఉత్తర ఫల్గుని బుద్ది  వికాసాన్ని దైర్య స్థైర్యాలను నూతనోత్తేజాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నదని  శాస్త్ర వచనం. వాతావరణ ప్రభావం తో ఆకులన్నీ రాలి పోయి చెట్లు మోడుబారి పోయే కాలమిది. కొత్త అవకాశాలకి ప్రతీకగా చిగుళ్ళ రూపం లో ఆశలను ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుందీ  మాసం.

      శుక్ల పాడ్యమి మొదలు ద్వాదశి వరకు  పన్నెండు రోజులూ భగవంతునికి పాలు మాత్రమే నివేదన చేసి ప్రసాదం గా స్వీకరించాలని చెబుతారు. మాసం లో గోదానం, ధాన్య దానం, వస్త్రదానం చేస్తే పుణ్యప్రదమని ధర్మ శాస్త్రాలు వివరిస్తున్నాయి.

      శుక్లపక్ష ఏకాదశి దీనినే ఆమలక ఏకాదశి అని కూడా అంటారు   రోజున ఉసిరి చెట్టును పూజించాలని, ఉసిరి ఫలాలను దానం చేయాలని, వాటిని తినాలని పురాణ కథనం. ఉసిరికి ఎన్నో ఔషద గుణాలున్నాయి, రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. అనేక వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది.

      ద్వాదశి -దీనినే గోవింద ద్వాదశి అని కూడా అంటారు  రోజున గంగా స్నానం చేయడం వల్ల  పాపాలన్నీ తొలగడం తో పాటు విశేష పుణ్య ఫలం లభిస్తుంది.

      పౌర్ణమి - మహా ఫల్గుని అని డోలికా పూర్ణిమ అని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామి ని ఊయలలో ఉంచి ఊపుతారు. కాబట్టి దీనీని డోలికా పూర్ణిమ అంటారు. ఉత్తర భారతదేశం లో  రాక్షస పీడ  తొలగిపోవడం కోసం హోలికా అనే శక్తిని ఆరాదిస్తారు. మరునాడు బహుళ పాడ్యమి వసంతోత్సవం పేరుతో ఒకరి పై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకొంటారు.పాల్గుణ  పౌర్ణమి మరుసటి రోజు నుండే వసంత మాసం ప్రారంభమవుతుంది. రోజు చందనం తో సహా మామిడి పూతను తిన్నవారు సంవత్సరమంతా సుఖం గా ఉంటారు

      అమావాస్య - రోజు సంవత్సరానికి ఆఖరు రోజు అయినా దీనిని కొత్త అమావాస్య అని పిలుస్తారు. కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు కాబట్ట్టి కొత్త అమావాస్య అని పిలుస్తారు. రోజు పితృ దేవతలను స్మరిస్తూ తర్పణాలు, పిండ ప్రధానం, దానాదులు చేయాలని, అలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని వంశాభివృద్ది జరుగుతుందని ప్రతీతి.
    వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ




సూర్య గ్రహణం

http://www.vipravanam.com/
     చంద్రుడు ఎప్పుడైతే భూమికి,సూర్యునికి మధ్యగా ప్రయాణిస్తాడో అప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఐతే గ్రహణం ఏర్పడటానికి మాత్రం సూర్యుడు,చంద్రుడు మరియు భూమి ఒకే సరళ రేఖ లో ఉండాలి.
     సూర్య గ్రహణం అమావాస్య నాడు ఏర్పడుతుంది.కానీ ప్రతి అమావాస్య రోజూ సూర్య గ్రహణం ఏర్పడదు.దానికి కారణం ప్రతి అమావాస్య రోజూ భూమి,చంద్రుడు మరియు సూర్యుడు ఒకే సరళ రేఖలో లేకపోవడమే.సూర్య గ్రహణం ఏర్పడిన సందర్భం లో సూర్యుని వైపు ఉన్న చంద్రుని భాగాన్ని కాంతి పూర్తిగా ఆక్రమిస్తుంది. అంటే భూమి వైపు ఉన్న చంద్రుని భాగం పూర్తిగా చీకటి అనమాట (చంద్రుడు కనిపించని రోజునే కదా మనం అమావాస్య అంటాం!)

సూర్య గ్రహణం ముఖ్యం గా నాలుగు రకాలుగా ఏర్పడుతుంది.

1) సంపూర్ణ సూర్య గ్రహణం: చంద్రుడు సూర్యుడిని పూర్తిగ కప్పివేయడం వల్ల ఇది జరుగుతుంది. అత్యంత ప్రకాశ వంతమైన గోళం వలే కనిపించే సూర్యుడు చంద్రుడి ఛాయ వల్ల ఒక సన్నటి అంచు వలే కనిపిస్తాడు. ఏదైన సమయంలొ సంపూర్ణ సూర్య గ్రహణం భూమి మీద ఒక ప్రదేశములొ వారికి మాత్రమే కనిపిస్తుంది.

2) అంగుళీయక (యాన్యులర్) సూర్య గ్రహణం: సూర్యుడు చంద్రుడూ ఒకే కక్ష్య లోకి వస్తారు. కాని సూర్యుని కంటే చంద్రుని పరిమాణము చిన్నదిగా ఉండడం వలన, చంద్రుని చుట్టూ సూర్యుడు ఒక ప్రకాశవంతమైన ఒక ఉంగరం వలే కనిపిస్తాడు.

3) సంకర గ్రహణం: ఇది సంపూర్ణ మరియు అంగుళీయక సూర్య గ్రహణాలకు మధ్యస్తంగా ఉంటుంది. సంకర గ్రహణము భూమిపై కొన్ని ప్రదేశాలలో సంపూర్ణ గ్రహణంగా, మరి కొన్ని ప్రదేశాలలో పాక్షికంగాను కనిపిస్తుంది. సంకర గ్రహాణాలు అరుదు.

4) పాక్షిక సూర్య గ్రహణం: సూర్యచంద్రులు ఒకే కక్ష్యలో ఉండరు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటాడు. అప్పుడూ ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్య గ్రహణం అని అంటారు. పాక్షిక గ్రహణం భూమి మీద చాలా భాగాలనుండి కనిపిస్తుంది.

09-03-2016 పాక్షిక సూర్యగ్రహణం :-
స్వస్తిశ్రీ మన్మధనామ సం. మాఘ .అమావాస్య తేదీ 09-03-2016 బుధవారం పూర్వాభాద్ర నక్షత్రయుక్త కుంభ మీన లగ్నములందు కేతుగ్రస్తము దక్షిణశరం నీలవర్ణము అపసవ్య గ్రహణము పాక్షిక కించిన్యూన పాదగ్రాస గ్రహణము సంభవించును.

స్పర్శ కాలము:- . 5-45 ని.లు
మధ్య కాలము:- .6-13 ని.లు
మోక్షకాలము:- .7-25 ని.లు
ఆద్యంత పుణ్యకాలము:- .1-40 ని.లు

వేధ ప్రారంభము :- ఇది ఖగ్రాస సూర్య గ్రహణము ( గ్రస్తోదిత ) కావున 8 తేది , మంగళవారము సూర్యాస్త సమయము నుండి గ్రహణ మోక్షము వరకు గ్రహణ వేధ నియమాలను పాటించాలి.

రాశుల వారిగా గ్రహణ ఫలితములు
మేష , వృషభ , కన్యా , ధనుస్సు రాశుల వారికి శుభ ఫలితము.

మిథున , సింహ , తులా , మకర రాశుల వారికి మిశ్రమ ఫలము.

కర్కాటక , వృశ్చిక , కుంభ , మీన రాశుల వారికి గ్రహణము అనిష్ట ఫలమును ఇచ్చును.

అనిష్ట ఫలము గల రాశుల వారు మరియు గర్భవతులు ఎట్టి పరిస్థితులలోనూ గ్రహణమును చూడరాదు.

గ్రహణ కరి దినము :-
గ్రహణము మరుసటి రోజు అనగా తేది : 10-03-2016 , గురువారము - గ్రహణ కరి దినము.

పాక్షిక సూర్యగ్రహణం దక్షణ ఆఫ్రికా, అంటార్కిటికా, దక్షిణ హిందూ మహాసముద్రం పై కనిపించును.
గ్రహణం సుమారు 28 ని.లు మాత్రమే కనిపించును.

గ్రహణమును పూర్వాభాద్ర నక్షత్రము, కుంభరాశి, మీనరాశి వారు చూడకూడదు. గ్రహణానంతరము యధావిధిగా కార్యక్రమములను జరుపుకోవచ్చు.

గ్రహణము యేయే రాశులయందు సంభవించునో వారు బంగారు రాహు, కేతు వెండి చంద్రబింబములను పూజించి, నెయ్యితో నిండిన కంచుగిన్నెనువస్త్రములను, నువ్వులతో తగిన దక్షిణలు కలిపి దానమీయవలయును. మరియు రావిచెట్టును తాకకుండా 21 ప్రదక్షిణలు చేయవలయును. గ్రహణ సమయమునందు దానము గ్రహించువారు దొరకకున్న గ్రహణానంతరము సంకల్పించుకున్నదానికి ద్విగుణీకృతంగా దానమీయవలయును.

గ్రహణములందు నూతన మంత్రానుష్ఠానము విశేష ఫలప్రదము. ఇష్టదేవతా మంత్రమును, గాయత్రీ మంత్రమును జపించవలయును. వానివలన మంత్రములు పరిశుద్ధమగును. జపం చేయకున్న మంత్రములు మాలిన్యమగును. వేదమంత్రమునకు మాలిన్యముండదు.

జాతాశౌచ మృతాశౌచములు కలిగియున్ననూ గ్రహణ స్నానాదికములు చేయవలయును.

గ్రహణ సమయమునందు సర్వ జలములు గంగా జలములు. సర్వ ద్విజులు వ్యాస భగవానులు. సర్వ దానములు భూదాన సమానమగును.

గ్రహణ సమయమున శయనించిన రోగము. మలమూత్ర విసర్జన, మైధునము చేసిన నరకము కలుగును.

గ్రహణమునకు ముందు వండిన వంటలను భుజించరాదు. ముడి పదార్థములు, పచ్చళ్ళు మొదలగు నిల్వ ఉంచిన పదార్ధములపై దర్భలను పరువవలెను.

గ్రహణము వదిలిన తరువాత శుద్ధ సూర్య బింబమును దర్శించుకుని, స్నానము చేసి వంటలు చేసుకొనవచ్చును. బాలలు, వృద్ధులు, అశక్తులు, పుత్రవంతులగు గృహస్థులు గ్రహణ ఘడియలు విడిచి భుజించవచ్చును.

 గ్రహణ కాల దాన మంత్రము :-
మమ జన్మరాశి జన్మ నక్షత్ర స్ధిత సూర్య గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతి పూర్వక ఏకాదశ స్ధాన స్ధిత గ్రహ సూచిత శుభ ఫలావాప్త్యర్ధం సూర్యబింబ నాగబింబ దానం కరిష్యే.

తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్ధనా!
హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదో భవ!!
విధుంతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత!
దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్ధవేత్!! అను మంత్రముచే చదివి

గ్రహణ సూచిత అరిష్ట వినాశార్ధం మమ శుభ ఫలావాప్త్యర్ధం ఇదం కేతుబింబ సూర్య బింబదానం ఘృతపూర్ణ కాంశ్య పాత్ర సహితం యధాశక్తి తిల వస్త్ర దక్షిణాసహితం తుభ్యమహం సంప్రదదే నమమ. అని దానమీయవలయును.

సంపూర్ణ సూర్య గ్రహణ శాంతికి తీసుకోవలసిన జాగ్రత్తలు

ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషముందిగ్రహణం పట్టగానే నదీ స్నానం చేసి, నదీ తీరాన జపం చేసుకుంటే ఫలితం ఇంకా ఎక్కువ. గ్రహణ స్పర్శ కాలమున నదీస్నానం, మద్యకాలమున తర్పణం, జపము, హోమం, దేవతార్చన  విడువుచుండగా దానం, స్నానం చేయటం మంచిది. గ్రహణ కాలమున భాగవన్నామస్మరణ చేయటం ఉత్తమం. గురువు ఉపదేశించిన  మంత్రజపము, వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్ర జపము గ్రహణ కాలమందు మరియు ఏడురోజుల వరకు  తప్పనిసరిగా ఆచరించవలెను. గ్రహణం రోజు ఉపవాస దీక్ష చేస్తే మంచిది. గ్రహణ సమయమందు గో భూ హిరణ్యాది (గోవులను, భూములను, బంగారాన్ని) దానములు చేయవలెను.

జ్యోతిష్య సలహాలు :
1) గర్భవతులు ప్రత్యేకించి గ్రహణ అనిష్ట ఫలము  గల గర్భవతులు గ్రహణ సమయంలో మీ గోత్ర నామాల పేరిట నిష్ఠావంతులైన  బ్రాహ్మణులచే
" గర్భ రక్షణ స్తోత్రము " పారాయణము చేయించాలి.
2) పిల్లలు , వయో వృధ్ధులు ఉన్న వారు వారి పేరిట
" మృత్యుంజయ స్తోత్ర పారాయణము " చేయించాలి.
3) అందరూ ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది.
4 ) సూర్య గ్రహణ సమయంలో నర్మదా నదీ స్నానము అత్యంత పుణ్యదాయకం కావున నర్మదా నదీ స్నానము చేయాలి.వీలు కాని వారు స్నాన సమయంలో నర్మదా నదీ స్మరణం చేస్తూ స్నానమాచరించాలి.
    వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ