http://www.vipravanam.com/
బాపూజీ చూపిన
సత్యం, అహింస మార్గాలు భావితరాలకు
బంగారు బాటగా మలచాయి. సత్యాగ్రహ్నా
ఆయుధంగా చేసుకొని బాపూజీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించడంతో భారత దేశానికి స్వాతంత్య్రం
లభించింది.
కాగా ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే రక్తపాత రహితంగా ఒక సుదీర్ఘ పోరాటం
ఫలితంగా స్వాతంత్ర్యం పొందిన
ఘనత కేవలం భారతదేశాకి మాత్రమే
దక్కుతుంది. ఒక సామాన్య కుటుంబంలో
జన్మించిన బాపూజీ తాను నమ్మిన సిద్ధాంతాలను
ఆచరించి భారత దేశంలోనే కాకుండా
ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన స్ధానాన్ని
సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. గాంధీజీ అసలు పేరు మోహన్
దాస్ కరంచంద్ గాంధీ. గాంధీజీ గుజరాత్ రాష్ట్రంలో కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో
1869 అక్టోబర్ 2 వ తేది కరంచంద్
గాంధీ, పుత్లీ బాయి దంపతులకు జన్మించాడు.
కాగా గాంధీజీ తండ్రి పోరు బందర్ సంస్ధానంలో
ఒక దివాన్ గా పచేసేవాడు. ఉన్నత
విద్య చదవక పోయినా సమర్థుడైన
ఉద్యోగిగా పేరు సంపాదించాడు. అలాగే
తల్లి హిందూ సంప్రదాయాలను తు.చ. తప్పక పాటించే
సాధ్వీమణి. తల్లి దండ్రుల సంరక్షణలో
గాంధీజీ బాల్యం గడిచింది. గాంధీజీ చదువులో చురుకైన విద్యార్థి కాదు. తరగతి గదిలో
ఎక్కువ బిడియ పడుతూ వెనుక
వరసలో కూర్చొనే వాడు. పాఠశాల విడిచిన
వెంటనే ఆట పాటల యందు
ఆసక్తి చూపక ఇంటికి వెళ్లి
పోయేవాడు. ప్రాథమిక విద్య రాజ్కోట్లో, ఉన్నత విద్య
కథియ వాడ్లో కొనసాగింది.
గాంధీ విద్యార్థి దశలో ఉండగా ఒకసారి
ఆ పాఠశాలకు పరీక్షాధికారి వచ్చి విద్యార్థులను పరీక్షించడం
జరిగింది. గాంధీజీ జవాబులు రాయలేకపోవడంతో ఆ సమయంలో ప్రక్కనున్న
విద్యార్థి జవాబులను చూసి రాయమని ఉపాధ్యాయుడు
ప్రోత్సహించాడు. అయితే గాంధీ ఇందుకు
రాకరించాడు. చెడు సావాసాల వల్ల
పొగ త్రాగడం, మాంసం తినడం జరిగింది.
అయితే త్వరలోనే తన తప్పు తెలుసుకొని
పశ్చాత్తాపం చెంది తిరిగి ఇటువంటి
పనులు చేయనని తల్లి దండ్రులకు ప్రమాణం
చేశాడు. గాంధీకి 13 వ ఏట కస్తూరి
బాయితో బాల్య వివాహం జరిగింది.
గాంధీ మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై బారిష్టర్ విద్యను అభ్యసించడాకి తన 17 వ ఏట
లండన్ నగరాకి వెళ్లాడు. తల్లికిచ్చిన మాట ప్రకారం కఠోర
నియమాలతో విద్యను పూర్తి చేసి స్వదేశాకి తిరిగి
వచ్చాడు. కొంత కాలం ముంబై,
కథియ వాడ్ లలో న్యాయవాదిగా
ప్రాక్టీసు నిర్వహించారు. సత్య వాక్య పరిపాలనా
దక్షుడైన గాంధీజీకి ఎక్నొ
సందర్భాల్లో చేదు అనుభవాలు ఎదురై
బాధ కలిగింది. కాగా 1893 లో అబ్దుల్లా సేఠ్
అనే వ్యాపారి సహాయంతో దక్షిణాఫ్రికా వెళ్లాడు. అయితే అక్కడ అడుగడుగునా
జాతి వివక్షతను ఎదుర్కొని మిక్కిలి మనస్తాపానికి గురయ్యాడు. అయినా మొక్కవో ధైర్యంతో
సమర్థుడైన న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. ఆ
సమయంలో అక్కడి భారతీయ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశాడు.
సత్యాగ్రహ్నా ఆయుధంగా చేసుకొని శ్వేత జాతీయుల దురహంకారన్ని
ఎదిరించి జాతి భేద్నా తొలగించేందుకు
అవిశ్రాంత పోరాట్నా సాగించాడు. ట్రాన్స్ వాల్ పట్టణంలో ఫోక్స్
ఆశ్రమ్నా స్ధాపించి ఆదర్శ వంతమైన విద్యా
బోధనను ప్రవేశ పెట్టాడు. అక్కడే ఇండియన్ ఒపీయన్ అనే వార పత్రికను
స్ధాపించాడు. కాగా 1915 జనవరి 9 వ తేది న
దక్షిణాఫ్రికా నుండి భారత దేశాకి
తిరిగి వచ్చాడు. 1916 లో అహ్మదాబాద్ లో
సబర్మతి ఆశ్రమ్నా స్దాపించాడు. ఇక్కడే తన అనుచరులకు సత్యం,
అహింస మొదలగు మార్గాలను అనుసరించే విధాన్నా బోధించాడు. 1916 ఫిబ్రవరి 4 న కాశీలో హిందూ
విశ్వ విద్యాలయం లో ప్రసంగించాడు. ఇదే
రోజు రవీంద్ర నాథ్ ఠాగూర్ గాంధీ
మహాత్మా అని సంబోధిస్తూ టెలిగ్రాం
పంపాడు. లక్నోలో జరిగిన కాంగ్రెస్ సభలో గాంధీజీ నెహ్రూను
తొలిసారిగా కలుసుకున్నాడు. ఇతర జాతీయ నాయకులు
సంస్కరణల కోసం చర్చలు సాగిస్తుండగా
గాంధీజీ బీహార్ లో చంపారన్ రైతుల
సమస్యల పరిష్కారానికి కృషి చేశాడు. ఇక్కడి
రైతులు తీన్ కథియా అనే
పద్ధతికి కట్టుబడి ఉండేవారు. తమ భూముల్లో పంటను
పండించి బ్రిటిష్ తోటల యజమానులు నిర్ణయించిన
ధరకు వారికే అమ్మాల్సి వచ్చేది. దీంతో రైతులు తోటల
యజమానుల అణచివేత చర్యలకు గురయ్యేవారు. దక్షిణాఫ్రికాలో గాంధీజీ చేపట్టిన ఉద్యమాలను గురించి విని చాలా మంది
చంపారన్ రైతులు తమ ప్రాంతాకి వచ్చి
కాపాడమని ఆయనను ఆహ్వాంచారు. గాంధీ
అక్కడికి వెళ్లి రైతులు పడుతున్న ఇబ్బందులు గురించి ప్రభుత్వాకి తెలియ పరచడంతో తీన్
కథియా పద్ధతి రద్దు అయ్యింది. గాంధీ
సాధించిన ఈ విజయం అనేక
మంది యువ జాతీయ వాదులను
ఆకర్షించింది. ఆయన ఆదర్శవాదం, గుణ
శీలమైన, నిర్ణయాత్మకమైన, ఆచరణాత్మకమైన రాజకీయ దృక్పథం వారి ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అలాగే గుజరాత్ లో కైరా జిల్లాలో
పంటలు పండక పోయినప్పటికీ పన్నులు
చెల్లించమని రైతులను వేధిస్తున్న అక్కడి రెవిన్యూ అధికారుల చర్యలకు నిరసనగా 1918 లో సత్యాగ్రహం ప్రారంభించాడు.
అపుడు ప్రభుత్వం స్పందించి పన్నులను రద్దు చేసింది. ఇదే
సంవత్సరంలో అహ్మదాబాద్ మిల్లు పనివారు తమ వేతనాలను పెంచమని
సమ్మె చేయగా గాంధీజీ సత్యాగ్రహం
చేపట్టి మిల్లు యజమానులను అంగీకరింప జేసి కార్మికుల వేతనాల్లో
35 శాతం పెరుగుదలను సాధించాడు. స్ధానిక ప్రాంతాలలో చేసిన సత్యాగ్రహ ప్రయోగాలలో
విజయ్నా సాధించిన తర్వాత గాంధీజీ తన దృష్టి జాతీయ
సమస్యల వైపు మళ్లించాడు. కాగా
బ్రిటిష్ ప్రభుత్వం 1919 లో ప్రవేశపెట్టిన మాంటేగు
ఛెమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతీయులలో
అసంతృప్తి కలిగించాయి. అంతే గాకుండా విప్లవ
కారుల కార్యక్రమాలను అణచి వేసేందుకు విచారణ
లేకుండానే ఎవ్వరినైనా అదుపు లోకి తీసుకునేందుకు
బ్రిటిష్ ప్రభుత్వం 1919 ఫిబ్రవరిలో రౌలత్ చట్ట్నా చేసింది.
భారతీయులందరూ ఈ చట్ట్నా తీవ్రంగా
వ్యతిరేకించారు. కాగా గాంధీజీ రౌలత్
చట్టాకి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 6 న దేశ వ్యాప్తంగా
సాధారణ హర్తాళ్ కు పిలుపుచ్చాడు. ప్రజలు
స్వచ్ఛందంగా అరెస్టై జైలుకు వెళ్లాలని సూచించాడు. ఈ పిలుపుకు స్పందించి
దేశ ప్రజలందరూ అపూర్వ ఉత్సాహంతో కదలి వచ్చారు. ప్రజా
ప్రతిఘటన అణచి వేయాలని ప్రభుత్వం
నిర్ణయించింది. గాంధీజీ ఢిల్లీ కి వెళుతుండగా ఆయనను
మధ్యలోనే ఆపి బలవంతంగా ముంబైకి
పంపారు. గాంధీ ముంబైకి చేరుకున్న
సమయంలో గుమిగూడిన ప్రజలపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు.
ప్రజా నిరసన వెల్లువను అణచి
వేత చర్య తో ఎదుర్కోవాలని
ప్రభుత్వం నిర్ణయించింది. కాగా గాంధీజీ యంగ్
ఇండియా, నవ జీవన్ పత్రికల్లో
సంపాదకత్వ్నా ప్రారంభించాడు. 1919 ఏప్రిల్ 10 న పంజాబ్లో
డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ అనే నాయకులను అరెస్ట్
చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని
అమృతసర్ లో ప్రజలు వ్యతిరేకించారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలపై కాల్పులు జరిపారు. కొంత మంది అధికారులు
కూడా మరణించారు. ఇద్దరు బ్రిటిష్ మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటిష్ వారి చర్య పట్ల
నిరసన తెలిపేందుకు 1919 ఏప్రిల్ 13 న అమృత సర్
లో జలియన్ వాలా బాగ్ అనే
విశాల మైన బహిరంగ స్ధలం
ఉన్న ఒక తోట మైదానంలో
అధిక సంఖ్య లో ప్రజలు
సమావేశమయ్యారు. దీనికి మూడు వైపులా మూసి
ఉండి కేవలం ఒక వైపు
మాత్రమే ద్వారం ఉండేది. అప్పటి సైనిక
కమాండర్ అయిన జనరల్ డి.డయ్యర్ తన సైక విభాగం
తో చుట్టుముట్టి ఉన్న ఒక ద్వార్నా
మూసివేయించి రైఫిల్లతో, మెషిన్ గన్లతో కాల్పులు
జరపమని ఆదేశించాడు. సైనికులు తమ దగ్గర ఉన్న
మందు గుండు సామాగ్రి అయిపోయేంత
వరకూ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపు
వెయ్యి మంది మరణించారు. వేలాది
మంది గాయ పడ్డారు. గాంధీజీ
దీన్ని అత్యంత అనాగరిక చర్యగా పేర్కొని తీవ్రంగా ఖండించారు. కాగా 1920 లో నాగపూర్లో
జరిగిన కాంగ్రెస్ సభలో గాంధీజీ ప్రవేశ
పెట్టిన సహాయ రాకరణోద్యమ తీర్మాన్నా
ఏకగ్రీవంగా ఆమోదించింది. 1942 లో క్రిప్స్ రాయబారం
విఫలం కావడంతో భారత రాజకీయ చరిత్ర
కొత్త మలుపు తిరిగింది. గాంధీజీ
బ్రిటిష్ పాలకులకు క్విట్ ఇండియా అనే నినాదాన్ని ఇచ్చాడు.
ఈ సందర్భంగా గాంధీతో సహా చాలా మంది
నాయకుల్ని నాటి ప్రభుత్వం నిర్భందించింది.
అనంతరం నాటి భారతీయుల స్వాతంత్య్ర
పోరాటానికి తలవొగ్గి బ్రిటిష్ ప్రభుత్వం 1947 ఆగష్టు 15 న స్వతంత్ర భారతావనిని
భారతీయులకు అప్పగించింది.
కాగా స్వతంత్ర భారత అభివృద్ధి చూడక
ముందే 1948 జనవరి 30 న నాథూరాం గాడ్సే
తుపాకీ గుళ్లకు గాంధీజీ బలయ్యాడు. ఆధునిక కాలంలో ఆవిర్భవించిన మహాత్ములలో ప్రప్రథముడు మన జాతిపిత. సత్యాహింసలు
అనే ఆయుధాలతో భారతీయులను స్వతంత్ర సమర యోధులుగా తయారు
చేసి రవి అస్తమించని బ్రిటిష్
సామ్రాజ్య పాలనకు చరమ గీతం పాడిన
మహా మనిషి ... భారత ప్రభుత్వం జనవరి
9 వ తేదీన ప్రవాస భారతీయుల
దినోత్సవంగా ప్రకటించింది.కాగా మహాత్మా గాంధీ
సిద్ధాంతాలను నేటి పాలకులు, ప్రజలు
అనుసరించి,ఆచరించినపుడే ఆయన ఆశయాలకు ఒక
అర్థం, పరమార్థం ఉండగలదని ఆశిద్దాం!
వల్లూరి పవన్
కుమార్
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్
శాఖ