Saturday, 30 May 2015

ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన ఈబ్రతుకు ప్రయాణం

ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన ఈబ్రతుకు ప్రయాణం
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
పాప బారసాలకైన ,తాత తద్దినానికైన
అక్షరం దిద్దిన ,అన్న ప్రాశన పెట్టినా ముఖ్య అతిథులం మేమే
ఇల్లుకట్టితే ఆడ బిడ్డలం మేమే
పెళ్ళిచేస్తే పిల్ల పెద్ద అన్నలం మేమే
పగలు ,రాత్రి ,ఉదయం ,సాయంత్రం
ప్రతిపూట తిరిగే సూర్యులం మేమే
మా కుటుంబం ,బంధువుల పేరంటాన్ని వదిలి మరీ
పనిచేసే శ్రామికులం మేమే
భార్య ,బిడ్డ తల్లి ,తండ్రి అన్న ,అక్కలందరికి దూరంయ్యేది మేమే
వాస్తు అని ,జ్యోతిష్యం అని ,పురాణం అని,ప్రశ్నలని ,పౌరోహిత్యం అని
ఏదో ఒక విద్యలో అలుపెరుగని యుధం చేసేది మేమే
ఇక మా రోజు ఎలా మొదలవుతదంటే ...!
ఉదయమే లేచి పూజ నైవేద్యం చేసి తిండి లేక తిప్పలుపడుతూ
ఎండనక వాననక ఆకలితో ఇల్లుచేరితే పంచంగామని ఫోనులో మరి విసిగించే వారి బాధితులం మేమే
అడుగు వేయాలన్న అడుగు తీయాలన్న
అడిగి చేసే వారి అడుగడుగునా మేమే
ఆపదలో ఉన్నవారికి 108 లమ్ మేమే
భయం లో ఉన్నవారికి 100 లమ్ మేమే
వరపూజ,అభిషేకం ,ఆరంభం ,దేవాలయం తీర్థయాత్ర ,వ్రతాలు ,పూజలు ఏదైనా మేమే
బండి నడవాలన్న, దుకాణం మూడు బారులు తీరాలన్న మేమే
చివరకు గ్రహాల స్థితి గతి మార్చాలన్న మేమే
యంత్రం కట్టాలన్న ,మంత్రం చదవాలన్న ,తంత్రం చేయాలన్న మేమే
కన్ను తెరవాలన్న మేమే
కట్టేకాలాలన్న మేమే
పుట్టుక నుండి చచ్హే దాక మేమే
ఎంత సంపాదించినా
సుఖం సంతోషం లేని జీవితం మాది
మేమే "పురోహితులం "

-వల్లూరి పవన్ కుమార్   

"విప్ర వనమ్" -బ్రాహ్మణ సమూహము    
 

Tuesday, 26 May 2015

బ్రాహ్మణ సంఘం వరంగల్ పేస్ బుక్ గ్రూప్ సబ్యుల సంఖ్య 10,000



బ్రాహ్మణ బంధువులందరికీ కృతజ్ఞతాపూర్వక దన్యవాదములు
 మన బ్రాహ్మణ సంఘం వరంగల్ పేస్ బుక్ గ్రూప్ సబ్యుల సంఖ్య 10,000 (పది వేలు) దాటిందని తెలుపుటకు సంతోశిస్తున్నాను, దీనికి సహకరించిన నా బ్రాహ్మణ బంధువులకు, మిత్రులకు, హితులకు, శ్రేయోభిలాషులకు, సభ్యులందరికీ హృదయ పూర్వక కృతజ్ఞ పూర్వక శుభాకాంషలు, కృతజ్ఞతలు.
దన్యవాదములు
మీ…
వల్లూరి పవన్ కుమార్
బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ అద్యక్షులు
9246812727,9246752735